వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీకి పెళ్లికాలేదు! అమ్మాయిలూ జాగ్రత్త: మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కి మాజీ ఎంపీ, ఎల్డీఎఫ్ నేత జోయిస్ జార్జ్.. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని, అతనితో యువతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇడుక్కిలో ఎల్డీఎఫ్ తరపున పోటీ చేస్తున్న ఎంఎం మణికి మద్దతుగా జోయిస్ జార్జ్ ప్రచారం చేసిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

'రాహుల్ గాంధీకి అసలే పెళ్లి కాలేదు. అతడి వద్దకు వెళ్లేటప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ కార్యక్రమాలన్నీ మహిళల విద్యాలయాల్లోనే జరుగుతాయి. అక్కడకు రాహుల్ వెళ్లి అమ్మాయిలను ఎలా బెండ్(వంగాలి)? ఎలా నిలబడాలి? అని నేర్పుతాడు. అందుకే నా ప్రియమైన యువతులు.. రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి ఇలాంటి పనులు చేయవద్దు. అతడికి పెళ్లి కాలేదు' అని జోయిస్ జార్జ్ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi is unmarried, girls shouldnt bend before him: Ex-Left MP

కాగా, జార్జ్ వ్యాఖ్యలు కేరళలో దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. 'ఓ ప్రజాప్రతినిధి ఈ తరహాలో ఆలోచించడం దురదృష్టకరం. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి' అని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల డిమాండ్ చేశారు. అయితే, జార్జ్ వ్యాఖ్యలపై ఎంఎం మణి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయిల గురించి అనుచితంగా మాట్లాడలేదని, రాహుల్ గాంధీని విమర్శించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ కొచ్చిలోని సెయింట్ థెరీస్సా కాలేజీ విద్యార్థినులకు ఐకిడో అనే మార్షల్ ఆర్ట్స్ లో మెళకువలు నేర్పించారు. దీన్ని లక్ష్యం చేసుకుని జోయిస్ జార్జ్ విమర్శలు చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలు జార్జ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

English summary
Congress leader Rahul Gandhi has made it a habit in recent years to campaign in schools and colleges to reach out to young voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X