మోడీపై తీవ్ర వ్యాఖ్యలు: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Recommended Video

    రాహుల్ గాంధీని అదుపులోకి తీస్కున్న పోలీసులు

    న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో రాహుల్ పాల్గొన్నారు. సీబీఐతో సహా ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. లోధీ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు ముందు ఆయన మోడీపై నిప్పులు చెరిగారు.

    సీబీఐతో సహా అన్ని వ్యవస్థలను మోడీ భ్రష్టు పట్టించారని చెప్పారు. దేశానికి కాపలాగా ఉంటానని చెప్పిన మోడీ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ కార్యాలయం వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు ఉపయోగించారు.

    Rahul Gandhi leads protest march against removal of CBI director Alok Verma

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోను సీబీఐ కార్యాలయాల వద్ద, ఇతర చోట్ల కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడారు. నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

    మోడీ చేతిలో రాజ్యాంగం అపహాస్యమైందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఏకపక్షంగా సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని చెప్పారు. రాఫెల్ స్కాంపై దర్యాఫ్తు చేస్తారనే భయంతో తొలగించారని చెప్పారు. ఒక్కో విమానం పైన రూ.11 వందల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. సీబీఐని ఆటవస్తువుగా మార్చారన్నారు.

    Rahul Gandhi leads protest march against removal of CBI director Alok Verma

    హైదరాబాదులోని సీబీఐ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ నేత ఎల్ రమణ, సీపీఐ నేత చాడ బైఠాయించారు. ఈ సందర్ఊభంగా వారు మాట్లాడారు. సీబీఐ డైరెక్టర్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని ఆరోపించారు. అన్యాయంగా సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారన్నారు. ప్రధాని మోడీ రాజీనామా చేస్తేనే దేశం బాగుపడుతుందని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+