దద్దరిల్లిన లోక్ సభ- సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలిన నేతలు
బడ్జెట్ సమావేశాల అయిదో రోజు లోక్ సభలో డోక్లామ్ పై వాడీవేడీగా చర్చ సాగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాలు వివాదానికి దారి తీశాయి. అధికార- ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు- ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఓ దశలో అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వారిని శాంతింపజేయడానికి స్పీకర్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అవేవీ సాధ్యపడలేదు. దీంతో సభను వాయిదా వేశారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా డోక్లామ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. తొలుత బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య చేసిన ఆరోపణలను రాహుల్ గాంధీ ఖండించారు. ఈ సందర్భంగా డోక్లామ్ పై ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణేను ఉటంకిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, అమిత్ షా ఘాటుగా స్పందించారు. దీంతో లోక్‌సభలో గందరగోళం చెలరేగింది.

చర్చ సందర్భంగా నరవణే.. తన ఆత్మకథలో రాసుకున్న కొన్ని అంశాలను చదివి వినిపించారు రాహుల్ గాంధీ. ఇప్పటివరకు ఆ పుస్తకం ప్రచురితం కాలేదు. అందులోని కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. ఇది నరవణే ఆత్మకథలోని భాగమని, అది ఇంకా పుస్తకరూపంలోకి రాలేదని రాహుల్ గాంధీ చెబుతూనే సిక్కిం సమీపంలోని డోక్లామ్ ట్రైజంక్షన్ లో భారత భూభాగంలోకి నాలుగు చైనీస్ ట్యాంకులు ప్రవేశించి ఓ పర్వత శ్రేణిని ఆక్రమించుకున్నాయని, వాటిని నరవణే ఇందులో వివరించారని రాహుల్ గాంధీ చెప్పారు. వాటిని చదివి వినిపించారు.
రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతుండగానే అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ అడ్డుకున్నారు. రాహుల్ ప్రస్తావించిన విషయాలేవీ వాస్తవం కాదని అన్నారు. వీటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పబ్లిష్ కాని పుస్తకం నుండి దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నిత అంశాలను ఉటంకించడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాహుల చెబుతున్న పుస్తకానికి సరైన ప్రామాణికత ఏమిటనేది సమర్పించాలని డిమాండ్ చేశారు.
దీనిపై మాట్లాడటానికి రాహుల్ గాంధీకి అనుమతించకూడదని డిమాండ్ చేశారు. తాను ఉటంకిస్తున్న పుస్తకాన్ని తక్షణమే సభ ముందు ఉంచాలని అన్నారు. అదే సమయంలో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ఆ పుస్తకం ప్రచురితమైందా అని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వివాదం సభలో మరింత ఉద్రిక్తతను పెంచింది. రాహుల్ మద్దతుగా అఖిలేష్ యాదవ్ నిలిచారు. చైనా అంశం సున్నితమైనదని, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలని కోరారు.
రామ్ మనోహర్ లోహియా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జార్జ్ ఫెర్నాండెజ్.. వంటి వారందరూ అందరూ చైనా గురించి ముందుగానే హెచ్చరించారని అఖిలేష్ పేర్కొన్నారు. భారత్- చైనా సరిహద్దులపై మరింత వివరంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి సమయం కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించారు. ఆ సమయంలో నిషికాంత్ దూబే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. వార్తాపత్రికల క్లిప్పింగ్‌లు లేదా పుస్తకాలపై చర్చించడం సభా సాంప్రదాయం కాదని అన్నారు.
స్పీకర్ ఓం బిర్లా ఆయనతో ఏకీభవించారు. నిబంధనలను పాటించాలని రాహుల్ గాంధీకి సూచించారు. సభ్యులకు తమ అభిప్రాయాలను తెలియజేసే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, సభ నిబంధనలు, విధానాలు, సంప్రదాయాల ప్రకారం నడుస్తుందని స్పష్టం చేశారు. దీనికి రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసినందువల్లే తాను ఈ విషయాన్ని లేవనెత్తాల్సి వచ్చిందని, దీనికి తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications