బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rahul Gandhi: అమ్మాయిలు పోటీపడి రాహుల్ తో సెల్ఫీలు, పిల్లలతో యువరాజు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మండ్య: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, యువరాజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో విజయవంతంగా కొనసాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో 511 కిలోమీటర్లు రూట్ మ్యాప్ తో రాహుల్ గాంధీ పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు. శుక్రవారం మండ్య జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్రం విజయవంతం కావడంతో ఆ పార్టీ, నాయకులు, కార్యకర్తలు సంబరపడిపోతున్నారు. శుక్రవారం రాహుల్ గాంధీతో పిల్లలు పాదయాత్ర చేశారు.యువతులు పోటీపడి రాహుల్ గాంధీతో సెల్ఫీలు తీసుకున్నారు.

Engineer: మేస్త్రీ భార్యతో మస్త్ మజా చేసిన ఇంజనీరు, కోసి కారం పెట్టిన బ్రదర్స్, పెళ్లికి పిలిస్తే !Engineer: మేస్త్రీ భార్యతో మస్త్ మజా చేసిన ఇంజనీరు, కోసి కారం పెట్టిన బ్రదర్స్, పెళ్లికి పిలిస్తే !

 రాహుల్ గాంధీ జోష్

రాహుల్ గాంధీ జోష్

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వారం క్రితం కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలో కర్ణాటకలో పాదయాత్ర (జోడో యాత్ర) మొదలుపెట్టారు. గుండ్లుపేట, నంజనగూడు, మైసూరు, మండ్య జిల్లాలలోని పాండవపుర, మేలుకోటే మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది.

 సత్త చూపించాలని లీడర్స్ ?

సత్త చూపించాలని లీడర్స్ ?

7 లోక్ సభ నియోజక వర్గాలు, 20 శాసన సభ నియోజక వర్గాల్లో మూడు విడతలుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. కర్ణాటకలో 511 కిలోమీటర్లు రూట్ మ్యాప్ తో రాహుల్ గాంధీ పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు. రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతున్న ప్రతినియోజక వర్గంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి సత్తా చూపించాలని కార్యకర్తలు తరలిస్తున్నారు.

 ఆదిచుంచనగిరికి రాహుల్ గాంధీ

ఆదిచుంచనగిరికి రాహుల్ గాంధీ

శుక్రవారం రాహుల్ గాంధీ పాదయాత్రలో అవ్వాతాతలు, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనేక మంది యువతులు పోటీపడి రాహుల్ గాంధీతో సెల్ఫీలు తీసుకున్నారు. తనతోపాటు పాదయాత్ర చేసిన పిల్లలతో రాహుల్ గాంధీ స్వయంగా సెల్ఫీలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతున్న పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫెక్ల్సీలు దర్శనం ఇస్తున్నాయి. శుక్రవారం రాహుల్ గాంధీ ఆదిచుంచనగిరి మఠం మైదానంలో బస చెయ్యనున్నారు.

English summary
Rahul Gandhi's Bharat Jodo Yatra resumes reach Adichunchanagiri on Friday. Friday yatra will stay in Adichunchanagiri Math,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X