వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధ్వీ వ్యాఖ్యలు: నల్లగుడ్డతో రాహుల్ గాంధీ మౌన దీక్ష... భజన చేసిన బీజేపీ ఎంపీలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతీ వ్యాఖ్యలకు నిరసగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరి నిరసనలో పాల్గొన్నారు.

శుక్రవారం పార్లమెంట్ ప్రారంభానికి ముందు మూతులకు నల్లగుడ్డలకు కట్టుకుని ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. మంత్రి సాధ్విని తక్షణమే పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన ప్రకటించడం ఇదే మొదటి సారి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ "ప్రజాస్వామ్య ప్రక్రియ నాశనం చేశారు. ప్రభుత్వం పనిచేసే తీరును చూసిన మేము మాట్లాడేందుకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. మేము ప్రతి అంగుళం వరకు పోరాడతాం" అని అన్నారు. మంత్రిని పదవి నుంచి తొలగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఆ తర్వాత గాంధీ విగ్రహాం వద్దకు చేరుకున్న బీజేపీ ఎంపీలు రఘుపతి రాఘవ రాజారాం అంటూ మహాత్ముని భజన పాడుతూ సమావేశాలు కొనసాగనివ్వని విపక్ష సభ్యుల ప్రవర్తన పట్ల నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఈ రోజు ఉదయం పార్లమెంట్ సభ ప్రారంభమైన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో అలాంటి భాషను ఉపయెగించవద్దని తాను మంత్రులతో చెప్పానని అన్నారు. తను కొత్త ఎంపీ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారని, ఈ క్రమంలో సాధ్వి క్షమాపణలను అంగీకరించాలని ప్రధాని సభను కోరారు.

క్షమాపణలు కోరిన దృష్ట్యా వివాదం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ సాధ్వి ఉభయసభలకు క్షమాపణ చెప్పిన నేపథ్యంలో... సభ నిర్వహణకు సహకరించాలని కోరారు. లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ సాధ్వీపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సాధ్వీ వ్యాఖ్యలపై ప్రధాని ప్రకటన చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనేక ప్రజా సమస్యలను సభలో చర్చించాల్సి ఉందన్నారు.

ఇక రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ కూడా సభలో దుమారం రేగింది. జ్యోతి మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం సృష్టించాయి. సాధ్వి వ్యాఖ్యలపై ప్రభుత్వం, విపక్షాలు కూర్చోని మాట్లాడుకోవాలని చైర్మన్ హమీద్ అన్సారీ సూచించారు.

పశ్చిమ ఢిల్లీలోని శ్యాంనగర్‌లో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సాధ్వీ నిరంజన్ జ్యోతి అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌లోని ముస్లింలు, క్రైస్తవులు అందరూ రాముడి బిడ్డలే. దీన్ని ఒప్పుకోనివాళ్లు దేశంపట్ల విశ్వాసం లేనివారే. అక్రమ సంతానానికి, రాముడి బిడ్డలకు మధ్య జరుగుతున్న పోటీయే ఢిల్లీ ఎన్నికలు'' అని అన్నారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరి నిరసనలో పాల్గొన్నారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

శుక్రవారం పార్లమెంట్ ప్రారంభానికి ముందు మూతులకు నల్లగుడ్డలకు కట్టుకుని ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరి నిరసనలో పాల్గొన్నారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మంత్రి సాధ్విని తక్షణమే పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరి నిరసనలో పాల్గొన్నారు.

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

శుక్రవారం పార్లమెంట్ ప్రారంభానికి ముందు మూతులకు నల్లగుడ్డలకు కట్టుకుని ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. వీరికి నిరసనగా మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలు భజన చేశారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ "ప్రజాస్వామ్య ప్రక్రియ నాశనం చేశారు. ప్రభుత్వం పనిచేసే తీరును చూసిన మేము మాట్లాడేందుకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. మేము ప్రతి అంగుళం వరకు పోరాడతాం" అని అన్నారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

ఈ రోజు ఉదయం పార్లమెంట్ సభ ప్రారంభమైన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో అలాంటి భాషను ఉపయెగించవద్దని తాను మంత్రులతో చెప్పానని అన్నారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సాధ్వీ వ్యాఖ్యలపై ప్రధాని ప్రకటన చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనేక ప్రజా సమస్యలను సభలో చర్చించాల్సి ఉందన్నారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

ఇక రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ కూడా సభలో దుమారం రేగింది. జ్యోతి మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం సృష్టించాయి.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ సాధ్వీపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

 మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

మూతికి నల్లగుడ్డతో ప్రతిపక్ష ఎంపీలు

పశ్చిమ ఢిల్లీలోని శ్యాంనగర్‌లో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సాధ్వీ నిరంజన్ జ్యోతి అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌లోని ముస్లింలు, క్రైస్తవులు అందరూ రాముడి బిడ్డలే. దీన్ని ఒప్పుకోనివాళ్లు దేశంపట్ల విశ్వాసం లేనివారే. అక్రమ సంతానానికి, రాముడి బిడ్డలకు మధ్య జరుగుతున్న పోటీయే ఢిల్లీ ఎన్నికలు'' అని అన్నారు.

English summary
With a black band around his mouth, Congress vice-president Rahul Gandhi on Friday joined other opposition leaders in a protest at Parliament against the abusive comments made by Union Minister Sadhvi Niranjan Jyoti, an issue that has rocked Parliament all this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X