కాంగ్రెస్ పై చేయి ఇలా: జేడీయూ నేత ఛోటు వాసవతో పొత్తుతోనే సాధ్యం?

యునైటెడ్ జనతాదళ్ శరద్ యాదవ్ గ్రూపు నాయకుడు, ఏకైక ఎమ్మెల్యే ఛోటు భాయి వాసవతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పట్టు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

గాంధీనగర్: వచ్చేనెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ శరద్ యాదవ్ గ్రూపు నేత ఛోటుభాయి వాసవతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. ఒకవేళ ఛోటుభాయి వాసవ వంటి గిరిజన నాయకుడితో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారైతే 50 అసెంబ్లీ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధిస్తుందని అంచనా. ఇప్పటికే ఓబీసీ నాయకుడు అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీతో మమేకం అయ్యారు. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ ఇప్పటికే బీజేపీని ఓడించాలని పటేళ్లకు పిలుపునిచ్చారు.

మరోవైపు దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీతో దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్రుషి చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లాలో మూడు రోజుల పాటు నవ్ సర్జన్ యాత్ర నిర్వహించారు. మూడు రోజుల పాటు ఆరు జిల్లాల్లోని 35 అసెంబ్లీ స్థానాల్లో పర్యటించారు.

 సీఎంపీ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ

సీఎంపీ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ

మధ్యలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాయబరేలీలో ఎన్టీపీసీలోని బ్రాయిలర్ యూనిట్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించి వచ్చారు. ఈ ప్రాంతంలో ఛోటుభాయి వాసవ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ గుజరాత్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అశోక్ గెహ్లాట్, జేడీయూ - శరద్ యాదవ్ నాయకుడు ఛోటుభాయి వాసవతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఛోటూభాయి వాసవతోపాటు జిగ్నేశ్ మేవానీ, పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ తదితరుల మద్దతు కోసం వారితో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. యంగ్ టర్కులతోపాటు ఛోటుభాయి వాసవలతో కలిసి పని చేసేందుకు వారు, కాంగ్రెస్ పార్టీ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) ఏర్పాటు చేయనున్నారు.

 రాహుల్ మొదటి దశ నవ్ సర్జన్ యాత్ర ఇలా

రాహుల్ మొదటి దశ నవ్ సర్జన్ యాత్ర ఇలా

గుజరాతీల్లో 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే అందులో భాగంగా ఈ యువ నేతలు హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీలను తనతో కలుపుకునేందుకు శత విధాల ప్రయత్నాలు సాగిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో భారుచ్, సూరత్ గిరిజనుల జనాభా అత్యధికంగా గల ప్రాంతాలు, భారూచ్ జిల్లా పరిధిలోని దయాద్ర గ్రామంలో ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ అంశాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తారు. దక్షిణ గుజరాత్ రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాలు భారుచ్, తాపి, వల్సాద్, దంగ్, నవ్‌సారి, సూరత్ జిల్లాల్లోనూ విస్త్రుతంగా పర్యటించారు. అంతకుముందు సెప్టెంబర్ 25వ తేదీన సౌరాష్ట్ర రీజియన్‌లో తొలి దశ రాహుల్ గాంధీ ‘నవ్ సర్జన్ యాత్ర' మొదటి దశ మొదలైంది.

 అహ్మద్ పటేల్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌తో పెరిగిన బంధం

అహ్మద్ పటేల్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌తో పెరిగిన బంధం

గుజరాత్ రాష్ట్రంలో గిరిజన సంస్క్రుతి సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఛోటుభాయి వాసవ, ఆయన కుమారుడు మహేశ్ పని చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని గిరిజన హక్కుల పరిరక్షణకు భిలిస్థాన్ టైగర్ సేన (బీటీఎస్) స్థాపించారు. యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ)లో కీలక నేతగా వ్యవహరించిన ఛోటుభాయి వాసవ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయానికి సహకరించారు. నాటి నుంచి ఛోటుబాయి వాసవ, జేడీయూ శరద్ యాదవ్ గ్రూపు నాయకుడిగా వ్యవహరించారు. బీటీఎస్‌ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు అనుబంధ సంస్థగా భావించారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిత్యం సంబంధాలు సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+