రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్ రద్దు -కాంగ్రెస్ పార్టీ అనూహ్య ప్రకటన -బీజేపీ ఫిర్యాదుతో పోస్ట్ తొలగింపు
వివిధ అంశాలు మోదీ సర్కారుపై పోరులో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ షాకిచ్చిన వ్యవహారం ఆలస్యంగా వెల్లడైంది. ట్విటర్ సంస్థ రాహుల్ గాంధీ అధికారిక అకౌంట్ ను తాత్కాలికంగా రద్దు చేసిందని కాంగ్రెస్ పార్టీ శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొద్ది గంటల వ్యవధిలోనే ఖాతాను పునరుద్ధరించారు.
రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్ తాత్కాలికంగా రద్దయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ట్విటర్ అకౌంట్ రద్దయిన నేపథ్యంలో ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా రాహుల్ గాంధీ తన గళాన్ని వినిపిస్తారని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ ఇలా ప్రకటన చేసిన కాసేపటికే రాహుల్ ట్విటర్ అకౌంట్ రీయాక్టివేట్ అయింది.

ఢిల్లీలో గ్యాంగ్ రేప్, హత్యకు గురైన 9ఏళ్ల దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో రాహుల్ గాంధీ పోస్టు చేసిన ఫోటోలపై వివాదమే ఆయన ట్విటర్ ఖాతా రద్దుకు కారణంగా తెలుస్తోంది. హత్యాచార బాధితురాలి కుటుంబీకుల ఫొటోలను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ శిక్షార్హుడంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పలు జాతీయ సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే..
బీజేపీ నేతల ప్రకటనలతో అప్రమత్తమైన జాతీయ బాలల హక్కుల కమిషన్.. రాహుల్ గాంధీ పోస్టులు పోస్కో చట్టానికి విరుద్దమని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ట్విటర్ సంస్థకు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సదరు ఈ విషయమై ట్విట్టర్ ఇండియా స్పందించింది. రూల్స్‌కు వ్యతిరేకంగా పోస్ట్ ఉన్నట్లు గుర్తించామని, ట్వీట్‌ను తొలిగిస్తున్నట్లుగా నోటిఫికేషన్ ద్వారా రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చి శుక్రవారం నాడు ట్వీట్‍ను తొలిగించింది. అయితే, శనివారం నాడు రాహుల్ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోవడం గమనార్హం.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications