మోడీకి రాహుల్ 'చేయి' : అద్వానీతో సోనియా కబుర్లు

న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్‌హాల్ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమానికి హాజరైన బిజెపి, కాంగ్రెస్ సారథులు పరస్పర ఆత్మీయ పలకరింపులు, కరచాలనాలు, కులాసా కబుర్లలో తేలియాడారు. ప్రధాని నరేంద్ర సింగ్ మోడీ, కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీతో స్నేహ పురస్సరంగా గట్టిగా కరచాలనం చేసి పలుకరించారు.

బిజెపి కురువృద్ధుడు అద్వానీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అభివాదం చేశారు. ఇరువురూ కొద్దిసేపు కులాసాగా కబుర్లాడుకున్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించిన సెంట్రల్ హాల్‌లో అన్ని రాజకీయ పక్షాలకు చెందిన సభ్యులు కలివిడిగా కలిసిపోయి ఆత్మీయ ఆలింగనాలతో, పరస్పర పలకరింపులతో హుషారుగా కనిపించారు.

Rahul Gandhi shakes hands with Modi

ఎనిమిదో వరుసలో కూర్చున్న కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, మోతీలాల్ ఓరా, జైరామ్ రమేష్‌లతో మోడీ కరచాలనం చేసి పలకరించారు. ఈ సందర్భంగా రాహుల్ మోములో చిరునవ్వు దోబూచులాడింది. రాహుల్‌ని మోదీ కలిసిన తర్వాత పలు పార్టీలకు చెందిన సభ్యులు రాహుల్ చుట్టూ గుమిగూడారు. అలాగే సోనియా గాంధీ తన పక్కన బెంచీలో గంభీరంగా ఆసీనులైన అద్వానీతో సుదీర్ఘంగా ముచ్చటించారు.

అయితే స్థలాభావం వల్ల సభలో కొంత మంది ఎంపీలు కుర్చునేందుకు వీలులేకపోయింది. దీంతో చరణ్‌మిత్రా, బాబుల్ సుప్రియా, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మనోజ్ తివారీ తదితరులు 55 నిమిషాల పాటు నిల్చునే రాష్ట్రపతి ప్రసంగాన్ని విన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+