లోక్‌సభలో రాహుల్ నిద్ర: కళ్లు మాత్రమే మూసుకున్నారన్న రేణుకా చౌదరి

న్యూఢిల్లీ: గుజరాత్‌లో దళితులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన వైనంపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కునుకు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే గుజరాత్‌లో దళితులు చేస్తున్న ఆందోళనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్‌సభలో మాట్లాడారు.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత‌లు సహా ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌తో క‌లిసి తీవ్రంగా ఈ అంశంపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. లోక్‌సభలో ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఈ అంశంపై మాట్లాడుతున్న వేళ కెమెరాలు ఆయన పక్కనే ఉన్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడి వైపుకి మళ్లాయి.

Rahul Gandhi

ఇంకేముంది తలపై చేయి పెట్టుకుని రాహుల్ గాంధీ కునుకు తీయడం కనిపించింది. లోక్‌సభలో ఇంతటి సీరియస్ విషయంపై చర్చ జరుగుతుండే ఏ మాత్రం పట్టించుకోకుండా రాహుల్ గాంధీ నిద్రపోతుండటంపై మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. రాహుల్ తీరుని అధికార పార్టీ బీజేపీతో పాటు ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలు కూడా తప్పుబట్టాయి.

ఈ క్రమంలో రాహుల్ గాంధీ తీరును కాంగ్రెస్ పార్టీ వెనకేసుకు రావడం విశేషం. రాహుల్ గాంధీ నిద్రపోలేదని కేవలం కళ్లు మాత్రమే మూసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి చెప్పారు. సభ నుంచి వాకౌట్ అనంతరం బుధవారం ఆమె మాట్లాడుతూ మీడియాకు పనీపాట ఏమి లేదా? అని ప్రశ్నించారు.

మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ రేయింబవళ్లు పేద ప్రజల కోసం కష్టపడుతున్నారని, ఈ క్రమంలో పార్లమెంట్‌లో నిద్ర వచ్చి ఉండవచ్చని ఆయన చెప్పారు. నిజానికి రాహుల్ కునుకు తీశాక కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది.

ఇదే సమయంలో సభలో నిద్ర పోతున్న రాహుల్‌ దీనిని గమనించలేదు. ఒక్కసారిగా మెలకువ వచ్చి చూడటంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలెవ్వరూ కనపడకపోవడంతో ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఆయన కెమెరాలకు దొరికిపోయారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ నిద్రపోవడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో సైతం చాలాసార్లు పలు అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ నిద్రకు ఉపక్రమించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన గుజరాత్ పర్యటనను ఖరారు చేసుకున్నారు.

దళితులపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం గుజరాత్ వెళ్లి బాధిత దళిత యువకులను పరామర్శించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే గుజరాత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీని కలిశారు. బుధవారం ఉదయం పార్లమెంట్‌ను 'గోవుల కోసం దళితులపై దాడి' అనే ఘటన కుదిపేసింది.

పార్లమెంట్ కార్యాకలాపాలను బీఎస్పీ నేతలు అడ్డుకున్నారు. రాహుల్ పర్యటనపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆగ్రహం వ్కక్తం చేశారు. పార్లమెంటులో ఆందోళన చేస్తున్నప్పుడు నిద్రపోయిన రాహుల్ గాంధీ, ఇప్పుడు గుజరాత్‌లో దళితుల పరామర్శకు వెళ్లడం ఏంటని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+