పెళ్లిపై రాహుల్ గాంధీ మనసులో మాట - ఆ అమ్మాయి అయితే ఓకే..!!

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తన పెళ్లి పై స్పందించారు. తన మనసులో మాట బయట పెట్టారు. తన భార్య ఎలా ఉండాలో చెప్పారు. భారత్ జోడో యాత్రతో దూసుకువెళ్తున్న రాహుల్ తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నో బయట పెట్టారు. నాలుగు పదుల వయసు దాటినా రాహుల్ పెళ్లి ప్రస్తావన లేకపోవటం పైన పలు సందర్భాల్లో చర్చ జరిగింది. రాహుల్ వివాహం గురించి పలు సందర్భాల్లో రాజకీయంగానూ చర్చకు కారణమయ్యాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పొలిటికల్ లీడర్ గా ఉన్న రాహుల్ వీటిని పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. కానీ, ఇప్పుడు రాహుల్ తాను కోరుకున్న అమ్మాయి అయితే పెళ్లికి ఓకే చెప్పారు.

కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రత్యేకించి తన విహాహం గురించి రాహుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తల్లి సోనియా గాంధీ.. నానమ్మ ఇందిరా గాంధీలోని లక్షణాలు ఉన్న అమ్మాయిని తాను జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నానని చెప్పారు. పలు ఆసక్తికర అంశాల పైన రాహుల్ స్పందించారు. వ్యక్తిగత ఇష్టాల గురించి ఓపెన్ అయ్యారు. తనకు కార్లు కంటే మోటార్ కార్లు ఇష్టమని చెప్పారు. సైకిల్ ప్రయాణం తనకు అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. తనకు వాహనాల పైన ఆసక్తి ఉండదన్నారు.

Rahul Gandhi speaks in his life Partner, says prefer mix of qualities of both his mother Sonia and grandmother Indira

రాహుల్ గాంధీ సుదీర్ఘంగా చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంది. యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి సోనియాతో పాటుగా పార్టీ అధ్యక్షకుడు ఖర్గేతో కలిసి హాజరయ్యారు. తల్లి సోనియా గాంధీతో ముచ్చటిస్తూ తనకు ఎలాంటి అమ్మాయి కావాలనేది ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను పప్పు అని సంబోధించటం ఒక ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. లోలోపల భయాలతోనే కొందరు తనను అలా పిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. జీవితంలో సంబంధాలు సరిగా లేకపోవటం వలన విచారంతో ఒకరు తనను అలా అంటుంటారని వివరించారు. ఎన్ని పేర్లు పెట్టుకున్న పట్టించుకోనని రాహుల్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+