మళ్లీ వేసేశాడు: ఓ రాహుల్... ఓ అచ్యుతానందన్..ఓ అమూల్ బేబీ..ఇదీ స్టోరీ

కేరళ:అమూల్ బేబీ... ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ... అవును 2011లో ఈ పేరు తెగ పాపులర్ అయ్యింది. ఎంతలా అంటే రాజకీయ విమర్శల్లో భాగంగా లేవనెత్తిన పేరు ఏకంగా ఆ కంపెనీకే ఉచిత ప్రమోషన్‌గా మారి మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇంతకీ ఈ అమూల్ బేబీ విషయం ఇప్పుడెందుకంటారా..? 2011లో ఎవరైతే అమూల్ బేబీ పేరును బ్రాండ్‌ను ప్రమోట్ చేశారో మళ్లీ ఇంతకాలానికి ఆ నాయకుడు వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ నేత ఎవరు... అమూల్ బేబీని మళ్లీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు..?

కేరళలో పాపులర్ అయిన అమూల్ బేబీ పదం

కేరళలో పాపులర్ అయిన అమూల్ బేబీ పదం

2011వ సంవత్సరం... కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగుతోంది. పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అప్పుడే నాటి కమ్యూనిస్టు లీడర్ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానాందన్ నాటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ పేరు పెట్టారు. రాహుల్ గాంధీ అమూల్ బేబీ అంటూ కామెంట్ చేశాడు. అంతే ఈ పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఒక్క అచ్యుతానందన్ మాత్రమే కాదు చాలా మంది నాయకులు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించాలంటే అమూల్ బేబీ అని సంబోధించేవారు.

ఆసమయంలో అమూల్ బేబీ సరిగ్గా సూట్ అయ్యింది

ఆసమయంలో అమూల్ బేబీ సరిగ్గా సూట్ అయ్యింది

ఇక వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే ప్రకటన రాగానే 95 ఏళ్ల ఈ కురవృద్ధ కమ్యూనిస్టు స్పందించారు. ఇప్పటికీ రాహుల్ గాంధీ తనకు అమూల్ బేబీలానే కనిపిస్తారని చెప్పి అప్పుడెప్పుడో మరిచిపోయిన ఈ పదాన్ని తిరిగి గుర్తుచేశారు. ఒకప్పుడు రాహుల్ గాంధీని తాను అమూల్ బేబీ అని పిలిచానని ఆ సమయంలో ఆ పదం అతనికి కరెక్టుగా సూటైందని అన్నారు. అప్పుడు భారత రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నందున అలా సంబోధించాల్సి వచ్చిందని అచ్యుతానందన్ తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వయస్సు కూడా పెరిగింది.కానీ అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏమాత్రం మార్పు లేదా పరిణితి కనిపించడం లేదని అచ్యుతానందన్ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు.

ఇప్పటికీ రాహుల్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు

ఇప్పటికీ రాహుల్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు

కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, రమేష్ చెన్నితలా చెప్పిన మాటలు విని వాయనాడులో పోటీకి సిద్ధమయ్యారని ఇందులో అతని సొంత నిర్ణయం లేనందున ఆయన్ను ఇంకా అమూల్ బేబీగానే పరిగణిస్తున్నట్లు అచ్యుతానందన్ పోస్టులో వెల్లడించాడు. రాహుల్ సొంతంగా ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు అచ్యుతానందన్. రాహుల్ తెలివి ఎలాంటిదంటే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రకమని సెటైర్ వేశారు ఈ కమ్యూనిస్టు కురవృద్ధుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+