అదిగో.. నా మిత్ర ద్రోహి- ఓ వేసుకోండి: కేంద్రమంత్రికి రాహుల్ చురకలు

బడ్జెట్ సమావేశాల ఏడో రోజు లోక్ సభలో వాడీవేడీగా చర్చ సాగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాలు వివాదానికి దారి తీశాయి. అధికార- ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు- ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఓ దశలో అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వారిని శాంతింపజేయడానికి స్పీకర్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అవేవీ సాధ్యపడలేదు. దీంతో సభను వాయిదా వేశారు.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా డోక్లామ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. తొలుత బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య చేసిన ఆరోపణలను రాహుల్ గాంధీ ఖండించారు. ఈ సందర్భంగా డోక్లామ్ పై ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణేను ఉటంకిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, అమిత్ షా ఘాటుగా స్పందించారు. దీంతో లోక్‌సభలో గందరగోళం చెలరేగింది.

Rahul Gandhi Traitor Friend Remarks against MoS Ravneet Singh Bittu sparks war of words Parliament

ఇది ఇక్కడితో ఆగట్లేదు. పలువురు విపక్ష సభ్యుల సస్పెన్షన్ కు దారి తీసింది. దీంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. సస్పెండ్ అయిన సభ్యులతో రాహుల్ గాంధీ ఈ ఉదయం పార్లమెంట్ మెట్ల వద్ద బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వారి నినాదాలతో పార్లమెంట్ ఆవరణ మార్మోగింది. ఇండియా బ్లాక్ కు చెందిన ఇతర పార్టీల సభ్యులు కూడా వారితో జట్టుకట్టారు.

అదే సమయంలో- మెట్ల ఉన్న రాహుల్ గాంధీ, ఇతర సభ్యులను దాటుకుని లోనికి వెళ్లడానికి కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టూ అటుగా వచ్చారు. ఆయనను చూస్తూనే రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. "హలో.. నా మిత్ర ద్రోహి (Traitor Friend).." అంటూ పిలిచారు. దీంతో వెనక్కి తిరిగి చూసిన బిట్టుతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. "నా ట్రైటర్ ఫ్రెండ్ వెళ్తున్నాడు.. చూడండి.." అంటూ అక్కడ బైఠాయించిన సభ్యులకు పరిచయం చేశారు.

దీనికి అంతే సెటైరికల్ గా స్పందించారు బిట్టూ కూడా. "వీళ్లేదో కార్గిల్ యుద్ధాన్ని గెలిచి వచ్చినట్లున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. బిట్టూ చేసిన వ్యాఖ్యకు రాహుల్ గాంధీ వెంటనే బదులిచ్చారు. "ఇతనే ద్రోహి.. ఇటుగా వెళ్తున్నాడు" అని బిట్టూను ఉద్దేశించి అన్నారు. అతని ముఖాన్ని చూడండి. మిత్ర ద్రోహిలా కనిపిస్తాడు" అని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన షేక్ హ్యాండ్ ను తీసుకోలేదు బిట్టూ. ఆయనను దేశ్ కే దుష్మన్" (దేశ ద్రోహి) అని దూషించారు. గతంలో బిట్టూ కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగారు. రాహుల్ కు ఆప్తుడిగా పేరుండేది అప్పట్లో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+