బెంగళూరులో రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాక్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తి కోసం సైంబర్ క్రైం పోలీసులు బెంగళూరులో గాలిస్తున్నారని తెలిసింది. రాహుల్ గాంధీ ట్విట్టర్ ను హ్యాక్ చేసిన వ్యక్తి ఎవరు ? అని సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇటీవల రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి అందులో అసభ్యంగా ట్విట్లు చేసి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇది రాజకీయ కక్ష అంటూ కాంగ్రెస్ పార్టీ సైతం ఆరోపించింది.

రాహుల్ గాంధీ ట్విట్టర్ ను హ్యాక్ చేశారని ఢిల్లీ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాహుల్ గాంధీ ట్విట్టర్ ను ఎవరూ ఓపెన్ చేశారు ? అనే విషయం ఇప్పటికీ వెలుగు చూడలేదు.

రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, అసభ్యంగా!

Rahul Gandhi twitter account is hacked. The hacked person is in bengaluru !

అయితే స్వీడన్, నార్వే దేశానికి చెందిన వ్యక్తులు రాహుల్ గాంధీ ట్విట్టర్ ను హ్యాక్ చేసి అసభ్యంగా ట్విట్లు పెట్టారని వెలుగు చూసింది. అందుకు అసలు కారణం ఐపీ అడ్రస్ లు స్వీడన్, నార్వే దేశాలకు చెందినవని ఇప్పటికే అధికారులు గుర్తించారు.

ఈ విషయంపై ఢిల్లీ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈటీ ఫిశింగ్ విధానంలో రాహుల్ గాంధీ హ్యాక్ చేశారని అధికారులు గుర్తించారు. ఫిశింగ్ టెక్నాలజీ ఉపయోగించి రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాక్ చేశారని వెలుగు చూసింది.

రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాక్ చేసింది మాత్రం కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి అని అధికారులు గుర్తించారు. అయితే రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాక్ చేసిన వ్యక్తి ఎవరు ? బెంగళూరులో ఎక్కడ ఉన్నాడు ? అని సైబర్ క్రైం బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rahul Gandhi's Twitter account was allegedly hacked on Wednesday night and a series of abusive and obscene tweets were sent from the account.
Please Wait while comments are loading...