ఒక్కరోజు రిక్షా తొక్కాలని ఉందన్న రాహుల్ గాంధీ
లక్నో: రిక్షా కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు తాను ఒకరోజు రిక్షా కార్మికుడిగా పని చేయాలని ఆలోచిస్తున్నానని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. రిక్షా కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు ఇది ఏమాత్రం సరిపోదని, వారి జీవితాలు బాగు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను కాంగ్రెసు పార్టీ తీసుకుంటుందని చెప్పారు.
రాహుల్ గాంధీ శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఆటో, రిక్షా కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... 'మీ సమస్యలు తెలుసుకోవడానికి ఒక రోజు రిక్షా కార్మికునిగా ఉండాలనుకుంటున్నా. ఒక్కరోజుతోనే మీ సమస్యలన్నీ తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. మీ జీవనాభివృద్ధి కోసం కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుంది' అన్నారు.

కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో సుమారు గంటన్నర పాటు రిక్షా కార్మికులతో గడిపిన రాహుల్.. రోజువారీ సంపాదన కోల్పోయి వచ్చినందుకు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రిక్షా కార్మికులు తమ సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.
మీరు గౌరవప్రదంగా జీవించడానికి సాధ్యమైనన్నీ చర్యలు తీసుకుంటామని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు యూపీలో పేదలకు చేరడం లేదని విమర్శించారు. అంతకుముందు రాహుల్ గాంధీ కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications