ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ: సోనియా ఇంటికి షిఫ్ట్!
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12-తుగ్లక్ లేన్‌లోని అధికార బంగ్లా నుంచి ఆయనకు చెందిన వస్తువులను డీసీఎం వాహనాల్లో తరలించారు. ఆయన ఇంటి వద్ద రెండు డిసీఎంలు ఉంచారు.
ప్రభుత్వ బంగ్లాను విడిచి వెళ్లాల్సి రావడంతో రాహుల్ అనేక ఇళ్లు చూసినప్పటికీ.. 10 జనపథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఆమెతోనే కలిసి ఉండనున్నారు. నివాసాన్ని ఖాళీ చేయడానికి ముందు రాహుల్ తన సామాన్లనను రెండు ట్రక్కుల్లో అక్కడికి షిప్ట్ చేశారు. ఏప్రిల్ 22 వరకు గడువు ఉండటంతో త్వరలోనే ప్రభుత్వ బంగ్లాను రాహుల్ పూర్తిగా వదిలి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, నాలుగేళ్ల కింద కర్ణాటక కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ 'మోడీ ఇంటిపేరు'ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మో సూరత్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు .. రాహుల్‌కు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది.

#WATCH | Trucks from Rahul Gandhi's 12 Tughlak Lane bungalow, carrying his belongings, arrive at the residence of UPA chairperson and Congress MP Sonia Gandhi's 10 Janpath residence in Delhi.
— ANI (@ANI) April 14, 2023
He is vacating his residence after being disqualified as Lok Sabha MP. pic.twitter.com/UNqJvPi7Bg
ఈ క్రమంలో ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా రాహుల్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనకు మార్చి 27న నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే రాహుల్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. కాగా, రాహుల్ లోక్‌సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications