గుడ్డు పగలాలి: ఆర్డినెన్స్‌పై రాహుల్‌కు సచిన్ మద్దతు

న్యూఢిల్లీ: నేర చరితుల ఆర్డినెన్స్ పైన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెసు పార్టీ నుండి మద్దతు లభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ యువ బృందం నేత, కేంద్రమంత్రి సచిన్ పైలట్ రాహుల్ వ్యాఖ్యలను సమర్థించారు. సచిన్ భిన్నంగా స్పందించారు.

ఆమ్లెట్ వేయాలంటే కోడి గుడ్డును పగలగొట్టాల్సిందేనని, రాహుల్ అదే పని చేశారని, ప్రభుత్వం, పార్టీ దానిని సమర్థిస్తోందని చెప్పారు. ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కించపర్చేలా లేవన్నారు. తమ పార్టీలో అందరికీ ప్రధాని పట్ల గౌరవముందన్నారు.

Rahul's intent, if not choice of words, was right: Sachin

ఆర్డినెన్స్ పైన స్పందించే విషయంలో రాహుల్ ఎంచుకున్న పదాలు, సందర్భంపై కొంత సంశయం ఉంటే ఉండొచ్చునని కానీ కాంగ్రెసు నేతల అభిప్రాయాన్నే రాహుల్ బయటకు చెప్పారన్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం రాహుల్ నేతృత్వం వహిస్తారన్నారు.

ఆర్డినెన్స్ పైన రాహుల్ అభిప్రాయానికి కేబినెట్, కాంగ్రెసు పార్టీ మద్దుతు పలికిందన్నారు. కాగా, ప్రముఖ న్యాయవాది కరణ్ తాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పైలట్ మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+