బ్యాట్ మ్యాన్ మాస్క్ తో రాహుల్ గాంధీ.. ఇండియా కూటమి ర్యాలీలో ఆసక్తికర పరిణామం..
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఇండియా కూటమి 'చలో దిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ' ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కూటమి నేతలు సుప్రీంకోర్టు వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
గతంలో రాహుల్ గాంధీని బ్యాట్ మ్యాన్ గా చిత్రీకరిస్తూ దేశ రాజధాని దిల్లీలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి రాహుల్ గాంధీ- బ్యాట్ మ్యాన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీలో రాహుల్ గాంధీ బ్యాట్ మ్యాన్ మాస్క్ లో షాక్ ఇచ్చారు. యూత్ కాంగ్రెస్ నాయకులు పంచిన బ్యాట్ మ్యాన్ మాస్కులతో రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనిపించారు. అంతేకాక ఖర్గేకు బ్యాట్ మ్యాన్ మాస్క్ ను పెడుతూ రాహుల్ ఉన్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎన్ఎస్ యూఐ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేసింది. " బ్యాట్ మ్యాన్ మోడ్ ఆన్..జ్ఞానేష్ తో గియో" అనే ట్యాగ్ లైన్ ను జత చేసింది. ఇక దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునే సూపర్ హీరోగా రాహుల్ గాంధీని గత కొంత కాలంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ ప్రచారంలో బ్యాట్ మ్యాన్ మాస్క్ లు, ఆ సూపర్ హీరో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్లిప్స్ ను భారీగా వాడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే గతంలో రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో విద్యార్థులు, యువ పౌరులతో 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సరదాగా మీరు బ్యాట్ మ్యాన్ ఆ..? అని రాహుల్ గాంధీని ప్రశ్నించాడు. అందుకు రాహుల్ స్పందిస్తూ.. 'బ్యాట్ మ్యాన్.. తాను ఒకే గదిలో ఎప్పుడూ లేమని అందరూ అనుకుంటున్నారులే' అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఆ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది.
అయితే ఆ ఫన్నీ రీల్ ను ఇప్పుడు నిజం చేసి చూపించింది కాంగ్రెస్. ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ ఆ జోక్ కు విజువల్ గా నిరూపించింది. ఈ క్రమంలో 13 సెకన్ల వీడియోను తన అధికారిక ఇన్ స్టాలో పోస్టు చేసింది. అందులో ఇటీవల నిరసనల్లో భాగంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కిన రాహుల్ గాంధీ బ్యాట్ మ్యాన్ అవతారంలోకి మారిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలకు బ్యాట్ మ్యాన్ మ్యూజిక్ ను కూడా యాడ్ చేసింది కాంగ్రెస్. అలాగే ఈ ఏడాది ఆగస్టులో దిల్లీలోని నేషనల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట రాహుల్ గాంధీని రియల్ లైఫ్ బ్యాట్ మ్యాన్ గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
