మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ నమోదు, ఆపరేషన్ కమల, భారీ మొత్తం!
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ప్రీతమ్ గౌడ, యడ్యూరప్పకు మీడియా సలహాదారు అయిన ఎంబి. మరంకల్ మీద గురుమిట్కల్ జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడ రాయచూరు జిల్లా ఎస్పీ డి. కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ నలుగురు తమను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేశారని. భారీ మొత్తంలో నగదు ఆశ చూపించారని శరణ్ గౌడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బీజేపీలోకి రాకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని బెదిరింపులకు దిగారని ఎమ్మెల్యే కుమారుడు శరణ్ గౌడ జిల్లా ఎస్పీ కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు.

రాయచూరు జిల్లా ఎస్పీ కిశోర్ బాబుకు సుమారు మూడు పేజీల లేఖలో దేవదుర్గ గెస్ట్ హౌస్ లో ఏం జరిగింది అని పూర్తి సమాచారంతో శరణ్ గౌడ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కుమారుడు శరణ్ గౌడ ఫిర్యాదు లేఖతో పాటు ఒక సీడీని జిల్లా ఎస్పీ కిశోర్ బాబుకు ఇచ్చారు.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తరువాత దేవదుర్గ వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం చెయ్యడానికి సిద్దం అయ్యారని, బెదిరింపులకు దిగారని, భారీ మొత్తంలో నగదు ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో సహ నలుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications