రేప్ కేసు: విచారణకు హాజరైన సదానంద తనయుడు

బెంగుళూరు: నటి, మోడల్ మైత్రేయిపై అత్యాచారం, మోసం కేసులో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యాడు. కార్తీక్ తన వాంగూల్మాన్ని శుక్రవారం రికార్డు చేసే అవకాశముంది. ఇప్పటికే అతడికి బెంగుళూరులో వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్తీక్ గౌడకు బెంగుళూరు సెషన్స్ కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Rail Minister's son Karthik Gowda appears before investigating officer

కార్తీక్ తనను 2013 జులై నెలలో పెళ్లి చేసుకున్నాడని సినీ నటి మైత్రేయి ఆరోపించిన విషయం తెలిసిందే. సరిగ్గా కార్తీక్ గౌడ నిశ్చితార్థం మడికెర జిల్లా కుశాలనగర తాలుకా మాదపట్టణలోని ఓ రిసార్టులో స్వాతి అనే యువతితో జరిగింది. అదే రోజు కార్తీక్ గౌడ తనను ఇంతకుముందే వివాహం చేసుకున్నాడని సినీ నటి, మోడల్ మైత్రేయ బెంగళూరులో చెప్పి, తనకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. తమ పెళ్లికి ఏకైక సాక్షి కార్తీక్ కారు డ్రైవరేనని ఆమె చెప్పింది.

ఇది ఇలా ఉంటే ప్రతినెలా 15, 30వ తేదీల్లో పోలీసుల ఎదుట హాజరవుతానన్న నింబధనతో రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు స్దానికుల గ్యారంటీలతో కార్తీక్ గౌడకు కోర్డు మందుస్తు బెయిల్ మంజూరు చేసింది. కార్తీక్ తన పాస్ పోర్డును పోలీసులకు అప్పగించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+