Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు..! ఎంతో తెలుసా ?
దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీల పెంపుకు రంగం సిద్దమైంది. రేపటి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ ఇప్పటికే ప్రకటించింది. వివిధ రకాల రైళ్లలో వివిధ రూపాల్లో ఈ టికెట్ రేట్ల పెరుగుదల ఉండబోతోంది. ఈ ఛార్జీల పెంపు ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా రూ.600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపుకు ప్రయాణికులు సిద్దం కావాల్సిందే.
తాజాగా పెరగనున్న రైల్వే ఛార్జీలు రేపటి నుంచి వర్తించబోతున్నాయి. వీటిలో రైళ్లలో జనరల్ టికెట్లకు 215 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణాలకు కిలోమీటరుకు 1 పైసా అదనపు ఛార్జీ విధిస్తున్నారు. అయితే మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు నాన్-ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2 పైసల పెరుగుదల ఉంటుంది. ఈ లెక్కన చూస్తే 500 కి.మీ నాన్-ఏసీ ట్రిప్‌కు అదనంగా రూ.10 ఖర్చవుతుంది. 215 కి.మీ కంటే తక్కువ దూరం ప్రయాణించే మార్గాలకు ఛార్జీలు పెరగట్లేదు.

పేద, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు కూడా ఇందులో ఊరట లభించనుంది. ప్రతీ నెలా వారు తీసుకునే సీజనల్ సబర్బన్ , నెలవారీ టిక్కెట్లకు ఛార్జీల పెంపు వర్తింపజేయడం లేదని రైల్వేశాఖ ప్రకటించింది. పదేళ్లుగా రైల్వేలు తమ నెట్ వర్క్ పెంచుకోవడం, మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించడం జరుగుతోందని, దీనికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఈ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది.

వాస్తవానికి రైల్వే శాఖ మొత్తం నిర్వహణ వ్యయం ఏటా 2.63 లక్షల కోట్లు దాటిపోయింది. ఇందులో ఉద్యోగుల జీత భత్యాలకు 1.15 లక్షల కోట్లు, పెన్షన్లకు 60 వేల కోట్లు ఖర్చవుతోంది. దీంతో పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు రైల్వేలు ప్రయాణీకుల ఛార్జీలలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు రైల్వే చెబుతోంది. అలాగే కార్గో లోడింగ్‌ను పెంచుకుంటున్నట్లు తెలిపింది. తాజాగా పండుగల సీజన్‌లో 12 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ విజయవంతంగా నడిపింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications