రైల్వే బడ్జెట్ 2026: ఈసారి రైల్వేలో రాబోయే 5 భారీ మార్పులు ఇవే!
Budget 2026: నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో రైల్వే రంగానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల భద్రత ఆధునిక సౌకర్యాలు, సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో రైల్వే శాఖ ఆశిస్తున్న 5 ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి.
1. సీనియర్ సిటిజన్లకు టికెట్ రాయితీల పునరుద్ధరణ
కొవిడ్ సమయంలో నిలిపివేసిన వృద్ధుల టికెట్ రాయితీలను మళ్లీ తీసుకురావాలని కోట్లాది మంది ఆశిస్తున్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు 50శాతం రాయితీ ఉండేది. ఈ బడ్జెట్‌లో దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా.

2. రైలు భద్రతకు 'కవచ్' రక్షణ - భారీ నిధులు
ఇటీవలి రైలు ప్రమాదాల నేపథ్యంలో స్వదేశీ భద్రతా వ్యవస్థ 'కవచ్ 4.0' (Kavach 4.0) విస్తరణకు బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. సుమారు 18,000 కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రూ. 1.3 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు ఉండవచ్చని సమాచారం. ఇది రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా రక్షిస్తుంది.
3. వందే భారత్ స్లీపర్ ట్రైన్లు
పగటిపూట నడిచే వందే భారత్ విజయవంతం కావడంతో ఇప్పుడు సుదూర ప్రాంతాల కోసం వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ స్థానంలో రాబోయే ఈ 24 కోచ్‌ల ఆధునిక రైళ్ల తయారీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. వీటి ప్రోటోటైప్ (నమూనా) 2026 చివరి నాటికి పట్టాలెక్కే అవకాశం ఉంది.
4. సామాన్యుల కోసం మరిన్ని జనరల్, స్లీపర్ కోచ్‌లు
మధ్యతరగతి, పేద ప్రజల రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ భారీ కసరత్తు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో 17,000 నాన్-ఏసీ (జనరల్, స్లీపర్) కోచ్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బడ్జెట్‌లో ఈ ప్లాన్‌కు అధికారిక ముద్ర పడనుంది.
5. రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు
ఈ ఏడాది రైల్వే బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది కంటే 10 శాతం పెరిగి సుమారు రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.75 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కొత్త లైన్ల నిర్మాణం, పాత ట్రాక్‌ల ఆధునీకరణ, డిజిటలైజేషన్ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.












Click it and Unblock the Notifications