వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ బంద్ నేపథ్యంలో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

|
Google Oneindia TeluguNews

అగ్నిపథ్ రగడ కొనసాగుతూనే ఉంది. రైల్వే స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. అయితే రేపు (సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అల్లర్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ఆర్పీఎఫ్ యూనిట్లకు ఆదేశించారు.

Recommended Video

Agnipath Scheme Myths VS Facts వాస్తవాలు వివరించిన కేంద్రం *Defence | Telugu Oneindia

పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నేరారోపణకు సరిపోయే సాక్ష్యాలను సేకరిస్తున్నారు. డిజిటల్ సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. మొబైల్, వీడియో రికార్డింగ్ సాక్ష్యం, సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.

 Railway officials on high alert ahead of proposed Bharat Bandh tomorrow

ఇప్పటికే 144 సెక్షన్‌ను నోయిడాలో విధించారు. రూల్స్ బ్రేక్ చేయొద్దని అధికారులు జనాన్ని కోరుతున్నారు. గుంపులు గుంపులుగా ఉండొద్దని స్పష్టంచేశారు. నలుగురి కన్నా ఎక్కువమంది ఉండొద్దని కోరుతున్నారు.

అగ్నిపథ్ పథకం అగ్గిరాజేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. అయితే విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణం సోషల్ మీడియా అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ గ్రూపులపై నిషేధం విధించింది.అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందజేశారు. అలా 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని పేర్కొంది. దాంతోనే హింసకు దారితీసిందని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరాతీసింది.

English summary
Railway Protection Force and Government Railway Police have sounded high alert amid calls for Bharat Bandh on Monday over the Centre’s new short-term recruitment policy for the defence forces, Agnipath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X