ఒడిశా నుంచి క్షతగాత్రులతో చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు-ఏపీలో బాధితుల వివరాలివే..
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో పశ్చిమబెంగాల్, ఏపీ, తమిళనాడుకు చెందిన పలువురు ప్రయాణికులు మృతిచెందారు, మరికొందరు గాయాల పాలయ్యారు. నాలుగు రాష్ట్రాల ప్రయాణికులు చిక్కుకున్న ఒడిశాలో నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైలు ప్రమాదంలో క్షతగాత్రులను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు వీలుగా రైల్వేశాఖ ఇవాళ ఉదయం భద్రక్ నుంచి ప్రత్యేక రైలు పంపింది.
భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్ మధ్య నడిచేలా ఈ ప్రత్యేక రైలును పంపారు. ఈ రైల్లో రైళ్ల ప్రమాదం కారణంగా గాయాల పాలైన వారితో పాటు ఒడిశాలో చిక్కుకుపోయిన వారిని తరలిస్తున్నారు. ఈ రైలు ఒడిశా నుంచి ఏపీ మీదుగా చెన్నైకి నడుపుతున్నారు. ఇవాళ ఉదయం ఒడిశాలోని భద్రక్ నుంచి 8.45కు ఈ రైలు బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలు చెన్నైకు రేపు (ఆదివారం) చేరుకోనుంది. ఈ రైలులో మొత్తం 250 మందిని పంపినట్లు తెలుస్తోంది. ఈ రైలు ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ రానుంది.

మరోవైపు కోరమండల్ ఎక్స్ ప్రెస్‍లో తెలుగు ప్రయాణికుల సంఖ్యను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఏపీకి చెందిన మొత్తం 178 మంది కోరమండల్‍లో ఉన్నారు. వీరంతా ప్రత్యేక రైలులో విజయవాడ బయల్దేరారు. వీరిలో విజయవాడలో 47, రాజమండ్రిలో 22, ఏలూరులో ఒకరు, ఇలా మొత్తం 178మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అలాగే యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్‍లోనూ తెలుగు ప్రయాణికులు ఉన్నారు. వీరు 52 మందికి పైగా ఉన్నట్టు సమాచారం.
అలాగే తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్లల్లో యశ్వంతపూర్ రైలులో ప్రయాణికులు ఎక్కినట్టు సమాచారం. ప్రయాణికుల సమగ్ర వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. తమవారి కోసం రైల్వేస్టేషన్లలో కుటుంబసభ్యుల ఆరా తీస్తున్నారు. హెల్ప్ లైన్లలో అధికారులు వారికి క్షేమసమాచారం ఇస్తున్నారు. మరోవైపు చెన్నై సెంట్రల్ నుంచి బాధితులు,మృతుల కుటుంబ సభ్యులను ఒడిశాలోని భువనేశ్వర్ కు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications