రైల్వే ట్రాక్ మీద సెల్ఫీ: బెంగళూరు విద్యార్థులు దుర్మరణం, విహారయాత్రలో సెల్ఫీ పిచ్చితో !
విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు సెల్ఫీ పిచ్చితో రైలు ఢీకొన్ని దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలో జరిగింది.
బెంగళూరు: విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు సెల్ఫీ పిచ్చితో రైలు ఢీకొన్ని దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలో జరిగింది. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న 22 ఏళ్ల ముగ్గురు యువకులు రైలు ఢీకొని దుర్మరణం చెందారు.
మంగళవారం బెంగళూరుకు చెందిన విద్యార్థులు బిడిది సమీపంలోని వండర్ లాకు విహార యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు వండర్ లా గేట్ సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లారు. రైలు వేగంగా వస్తున్న సమయంలో ముగ్గురు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు.

సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. ముగ్గురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జు అయ్యాయని పోలీసులు చెప్పారు. సెల్ఫీ పిచ్చితోనే ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
