రూ.2.5 లక్షల కోట్లు మురిగిపోయినట్టేనా: మెరుగుపడని రైల్వే: ఆ రిపోర్ట్‌లో పచ్చి నిజాలు
న్యూఢిల్లీ: రైల్వేలో సంస్కరణలను తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయా?, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. రైల్వేల పనితీరు మారట్లేదా?, రైళ్ల వేగాన్ని పెంచడానికి, నిర్ణీత గడువులోగా అవి గమ్యస్థానాన్ని చేరడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినా అవి ఫలించట్లేదా?- ఈ ప్రశ్నలన్నింటికీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అవుననే సమధానం చెబుతోంది. రైల్వేస్‌పై రూపొందించిన నివేదికలో అనేక విషయాలను ప్రస్తావించింది.

రైళ్ల సగటు వేగం ఎంత?
రైళ్ల వేగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మిషన్ రఫ్తార్‌ను అమలు చేస్తోంది. దీనికింద ఇప్పటివరకు 2.5 లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేసింది. ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగం గంటకు 50 నుంచి 75 కిలోమీటర్లు, గూడ్స్ బండ్ల స్పీడ్ 25 నుంచి 50 కిలోమీటర్లకు పెంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగ్ రిపోర్ట్ దీన్ని తప్పు పట్టింది. ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంలో ఎలాంటి మార్పు లేదని, అదే సమయంలో గూడ్స్ బండ్ల సగటు వేగం గంటకు 23.6 కిలోమీటర్లకు తగ్గినట్లు స్పష్టం చేసింది.

2019 నుంచి
2019-2020 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల స్థితిగతులను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించింది కాగ్. దీనికోసం 2,951 రైళ్ల సగటు వేగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో 62 రైళ్లు మాత్రమే గంటకు 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు స్పష్టం చేసింది. 37 శాతం రైళ్ల సగటు వేగం 55 నుంచి 75 కిలోమీటర్ల వరకే నమోదైందని పేర్కొంది. 933 రైళ్లు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో రాకపోకలు సాగించాయని, మరో 269 రైళ్ల వేగం గంటకు 40 కిలోమీటర్లేనని వివరించింది.

ఆ రైళ్ల వేగమూ అంతంతే..
కాగా రాజధాని, శతాబ్ది, సంపర్క్ క్రాంతి, జన్ శతాబ్ది, హమ్ సఫర్, ఏసీ సూపర్‌ఫాస్ట్, దురంతో, గతిమాన్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోలేకపోయాయని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. సూపర్ ఫాస్ట్ పేరుతో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను రైల్వే మంత్రిత్వ శాఖ వసూలు చేస్తోన్నప్పటికీ.. ఆయా రైళ్ల సగటు వేగం గంటకు 55-60 కిలోమీటర్ల వరకే ఉంటోందని కాగ్.. తన నివేదికలో పేర్కొంది.

పంక్చువాలిటీలోనూ ఫ్లాప్
సమయ పాలనలోనూ రైల్వేలు ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేదని కాగ్ తెలిపింది. సాధారణంగా- ఓ ఎక్స్‌ప్రెస్ నిర్దేశిత షెడ్యూల్ కంటే 15 నిమిషాల పాటు ఆలస్యంగా తన గమ్యస్థానానికి చేరుకున్నా- దాన్ని ఇన్ టైమ్ పరిగణిస్తుంటుంది రైల్వే శాఖ. ఈ సమయాన్ని కూడా వంద శాతం రైళ్లు అందుకోలేదని కాగ్ తేల్చింది. 69.23 శాతం రైళ్లు మాత్రమే సకాలంలో గమ్యస్థానాలకు చేరుకున్నట్లు పేర్కొంది. 2008-09లో రైళ్ల సగటు వేగం ఎంత ఉందో.. 2013-14లోనూ పెద్దగా మార్పు లేదని తెలిపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications