ఒడిశా ఘటనతో రైల్వేల అలర్ట్-దేశవ్యాప్తంగా సిగ్నల్స్ తనిఖీకి స్పెషల్ డ్రైవ్..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న మూడు రైళ్ల ఢీ ఘటన రైల్వేల్ని ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా వందే భారత్ రైళ్లంటూ నానా హంగామా చేస్తున్న కాలంలో ఇలాంటి ఘటన ఒక్కటి జరిగితే ఎంత ప్రాణనష్టం, ఆస్తినష్టం ఉంటుందో అందరికీ అర్ధమైంది. దీంతో రైల్వేలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి ప్రయాణికుల్లో ధైర్యం నింపేందుకు రైల్వేశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.
ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించిన 24 గంటల లోపే.. రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత "డబుల్ లాకింగ్" పై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సిగ్నలింగ్ సిస్టమ్‌లపై వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భద్రతా డ్రైవ్ చేపట్టాలని రైల్వే శాఖ ఆదేశించింది.

రిలే గదులు, సిగ్నలింగ్ ఉపకరణాన్ని నియంత్రించగలిగే ప్రదేశాలు రెండు రెట్లు లాకింగ్ కన్వెన్షన్‌తో లాక్ చేస్తారు. ఇందులో స్టేషన్ మాస్టర్, సిగ్నలింగ్ సిబ్బంది ఇద్దరూ దానిని తెరవడానికి అవసరం. రైల్వేల భద్రత దృష్ట్యా ప్రతి క్లిష్టమైన పాయింట్ వద్ద కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్ధను నిర్వహించడంలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అన్ని స్టేషన్లలోనూ క్యాబిన్ లు, హౌసింగ్ సిగ్నలింగ్ పరికరాలను తనిఖీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే డబుల్ లాకింగ్ వ్యవస్ధ సరికాదనే ఉందని నిర్ధారించుకోవాలని రైల్వేశాఖ ఆదేశాల్లో తెలిపింది. స్టేషన్లలోని అన్ని రిలే గదులు తనిఖీ చేయాలని, డబుల్ లాకింగ్ అమరికను సరిచూసుకోవాలని తెలిపింది.
డ్రైవ్ సమయంలో సిబ్బంది డేటా లాగింగ్, తలుపులు తెరవడం, మూసివేయడం కోసం SMS హెచ్చరికలు వస్తున్నాయా లేదో చూడాలి. పనిచేస్తున్న డబుల్ లాకింగ్ సిస్టమ్ రిలే గది యొక్క తాళం తెరిచినప్పుడు లేదా మూసివేయబడినప్పుడు సంబంధిత అధికారులకు SMS హెచ్చరిక వెళ్తుంది. సిగ్నలింగ్ పరికరాల కోసం డిస్‌కనెక్ట్, రీకనెక్షన్ నిర్దేశించిన నిబంధనలు, విధానాల ప్రకారం జరిగేలా చూడాలని కూడా రైల్వేశాఖ సిబ్బందిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications