అన్ని రెగ్యూలర్ ప్యాసింజర్ రైలు సర్వీసుల నిలిపివేత: ఎప్పటివరకో చెప్పలేమన్న రైల్వే

న్యూఢిల్లీ: దేశంలో అన్ని ప్యాసింజర్ రైళ్లు కూడా ఇప్పట్లో తమ సేవలను అందించవని రైల్వే స్పష్టం చేసింది. దీనిపై మళ్లీ ప్రకటన వెలువడే వరకూ కూడా ప్యాసింజర్ రైలు సర్వీసులు నడవవని తెలిపింది. అయితే, 230 ప్రత్యేక రైలు సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.

తాము మళ్లీ ప్రకటన చేసే వరకు కూడా రెగ్యూలర్ ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైలు సర్వీసులు నిలిచిపోనున్నాయని రైల్వే స్పష్టం చేసింది. 230 ప్రత్యేక రైలు సర్వీసులు మాత్రం నడుస్తాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ముంబైలోని లోకల్ రైళ్లు పరిమిత సంఖ్యలోనే నడుస్తాయని వెల్లడించింది.

Railways suspends all regular passenger services indefinitely

అదనపు ప్రత్యేక రైళ్లు అవసరం ఉంటే నడుపుతామని రైల్వే తెలిపింది. లాక్ డౌన్ తర్వాత రద్దయిన రెగ్యూలర్ ట్రైన్స్, సబర్బన్ ట్రైన్స్ సేవలు ఇప్పట్లో ప్రారంభం కావని తెలిపింది. ఆగస్టు 12 వరకు విధించిన రైళ్ల సర్వీసుల రద్దును మళ్లీ పొడిగించింది రైల్వే.

Recommended Video

    Fact Check : Indian Railways Clarifies No New Circular Issued On Suspension Of Train Services

    కాగా, ప్యాసింజర్ రైళ్ల రద్దు కారణంగా భారత రైల్వేకు సుమారు 40వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 22,94,438 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,44,249 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 16,04,119 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి 45,597 మంది మరణించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+