వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 వేల హెక్టార్లలో పంట నష్టం.. మొత్తం 68 శాతం ఎఫెక్ట్... ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

తమిళనాడులో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. చెన్నై, ఇతర పట్టణాలు, గ్రామాల్లో వరదనీరు పోటెత్తింది. నగరాలు/ పట్టణాలు ఇళ్లు దెబ్బతినగా.. గ్రామాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. మళ్లీ వానలు అని చెప్పడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ సారి కురిసిన వర్షాలతో రాష్ట్రంలో 50 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. ఇదీ వానకాలం పంటలో 68 శాతం కావడం పరిస్థితి తీవ్రతతకు అద్దం పడుతుంది.

చెన్నై, విల్లుపురం, కడలూరు, కన్యకుమారి, ట్యుటికొరన్, దక్షిణ డెల్టాపై వర్ష ప్రభావం ఉంది. వర్షంతో 2300 ఇళ్లు ధ్వంసానికి గురయ్యాయి. రాష్ట్రంలో రెండింట మూడొంతుల వర్ష ప్రభావానికి గురయ్యింది. నవంబర్‌లో కూడా వర్షం ఎక్కువగానే కురిసింది. నాగపట్టణంలో ఓ రైతు 15 ఎకరాల వరి పంట కోతకు వచ్చింది. అయితే వర్షం వల్ల అదీ నేల పాలయ్యింది. ఇలా చాలా మంది పంటను నష్టపోయారు. తన నగలు అన్నీ బ్యాంకులు ఉన్నాయని.. అతని చెప్పారు. తనకు పరిహారం ఇస్తేనే తిరిగి వ్యవసాయం చేస్తానని.. లేదంటే బ్యాంకు దానిని వడ్డీ కింద పట్టుకుందని చెప్పారు.

 Rain Damages 50,000 Hectares Of Crop As Tamil Nadu

వర్షాల వల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లు నిండిపోయాయి. దీంతో పొరుగు రాష్ట్రాలకు కూడా ముప్పు ఉంది. రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రాంతాన్ని కేంద్ర బృందం నాలుగోరోజు సందర్శించింది. 2600 కోట్ల సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కడలూరులో ప్రభావం ఎక్కువగా ఉండేది. వరదలు, సునామీ, తుఫాన్ ప్రభావం అక్కడే ఉంటుంది.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

ఇటు ఈసారి కూడా ఏపీలో ఆ 4 జిల్లాలపై మరోసారి వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు ఎక్కువగా.. ప్రకాశంలో కాస్త.. వరద ప్రభావంతో తల్లడిల్లాయి. తాజాగా అతి భారీ వర్ష సూచన రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ ఆ జిల్లాలే టార్గెట కావడం.. ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్న క్రమలో వాతావరణ శాఖ చేదు వార్తను తెలియజేసింది.

English summary
Crops spread over more than 50,000 hectares have been battered by heavy rain in Tamil Nadu which received 68 per cent more than average downpour this monsoon season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X