భర్తను ఏడాదిగా బెడ్రూంలోనే!: షాకిచ్చిన మహిళ
రాయపూర్: తన భర్త ఏడాదికాలంగా కనిపించకుండా పోయాడని ఇన్నాళ్లు చెప్పిన ఓ మహిళ, ఇరుగుపొరుగు వారి దెబ్బకు హఠాత్తుగా అసలు విషయం చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆమె పైన అనుమానం వచ్చి పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో బండారం బట్టబయలు అయింది.
తన భర్తను తమ ఇంట్లోని బెడ్రూంలో సమాధి చేసినట్లు చెప్పింది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంట్లోని పడక గదిలో కింద పూడ్చిపెట్టిన 45 ఏళ్ల రాజ్వీందర్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.
అయితే, తన భర్తను తాను చంపలేదని, అకాల మృత్యువాతపడటంతో అంత్యక్రియలకు డబ్బులు లేక ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు భార్య మన్ ప్రీత్ చెప్పారు.

ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం తెలిసిందే. ఆమె ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు చెప్పారు. వారు తవ్వకాలు జరిపారు.
అతనికి సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, సమాధి నిర్మాణానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో బెడ్రూంలో సమాధి చేసినట్లు చెప్పింది. కేసును పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేసేందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications