Rajasthan : రాజస్తాన్ ఎన్నికల పోలింగ్ తేదీ మార్చిన ఈసీ-కారణమేంటో తెలుసా ?

ఈ ఏడాది డిసెంబర్ తో గడువు ముగుస్తున్న రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే నెలలో రాజస్దాన్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కావాల్సి ఉంది. అంతలోనే ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఏకంగా ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈసీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజస్తాన్ లో వచ్చే నెల 23న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల పోలింగ్ ను రెండు రోజులు ముందుకు జరుపుతూ ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వెనుక సామాజిక కార్యక్రమాల కారణాన్ని చూపింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. రాజస్తాన్ లో నవంబర్ 23న భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. వీటిని వాయిదా వేసుకోలేని పరిస్ధితి కూడా ఉంది. దీంతో ఈసీ రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 25కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

rajasthan assembly election polling date changed - here is the reason

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 23న కాకుండా నవంబర్ 25న జరుగుతాయని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 3న మాత్రం యథావిధిగా ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రోజు పెళ్ళిళ్లు, సామాజిక నిశ్చితార్థాలు ఉన్నందున ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తున్నట్లు ఈసీ తన ప్రకటనలో వెల్లడించింది. పెద్ద ఎత్తున పెళ్లిళ్లు, సామాజిక నిశ్చితార్థాలు, పెద్ద సంఖ్యలో ప్రజలకు అసౌకర్యం, వివిధ లాజిస్టిక్ సమస్యల కారణంగా పోలింగ్ సమయంలో ఓటరు భాగస్వామ్యాన్ని తగ్గించడానికి దారితీయవచ్చని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+