రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌లు : కిలో రెండు రూపాయ‌ల‌కే ఆవు పేడ...

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హాడావుడి షూర్ అయ్యింది. ఏ పార్టీకపార్టీ త‌మ ఎన్నిక‌ల హామీల‌తో ఓటర్ల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాజస్తాన్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికల హాడావుడి మాములుగా లేదు. ఇక్క‌డి ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మ‌రింత వేగ‌వంతం చేశాయి. ప్రస్తుతం ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మ‌రోసారి కూడా త‌మ‌ ప్ర‌భుత్వ‌మే వ‌చ్చేలా కాంగ్రెస్ ఇక్క‌డ అహ‌ర్నిశ‌లు కృషి చేస్తోంది. అందుకోసం రాజ‌స్థాన్ ఓట‌ర్ల‌కు ఎన్నిక‌ల హామీల వ‌ర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగానే పశువుల యజమమానుల నుంచి కిలో రెండు రూపాయ‌ల‌కే ఆవు పేడ‌ను కోనుగోలు చేస్తామ‌నే హామీని కూడా ఇచ్చారు.

రైతుల ఆదాయాన్నిపెంచే దిశ‌గా...
ఎన్నిక‌ల హామీల్లో భాగంగా ఇప్పటివరకు సీఎం అశోక్ గెహ్లాట్ ఏడు హామీలను ఇక్క‌డ ప్రకటించారు. ఇందులో భాగంగానే పశువుల యజమమానుల నుంచి ఆవు పేడను కిలో రూ. 2 చొప్పున కొనుగోలు చేస్తామనే హామీ కూడా ఉంది. ఆవు పేడను కొనుగోలు చేయడం వల్ల రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్వచ్ఛమైన ఇంధనంగా మారేందుకు వీలు కల్పించే అవ‌కాశం ఉంద‌ని సీఎం గెహ్లాట్ అన్నారు.

Rajasthan Assembly Elections: Cow dung for Rs 2 per kg...

కాంగ్రెస్ ఎన్నిక‌ల హామీలు..
బుధవారం ఝుంజునులో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తమ రెండు హామీలను ప్రకటించారు. ఈ హామీల విషయం ఒక‌సారి చూస్తే... గృహ లక్ష్మి గ్యారెంటీ పథకం కింద కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి ప‌దివేల రూపాయ‌ల‌ను విడ‌త‌ల వారీగా అంద‌జేస్తారు. 1.05 కోట్ల కుటుంబాలకు ఐదువంద‌ల రూపాయ‌ల చొప్పున ఎల్‌పీజీ సిలిండర్లు అందిస్తామ‌ని చెప్పారు. ఇక, శుక్రవారం నాడు జైపూర్‌లో గెహ్లాట్ మరో ఐదు హామీలను ప్రకటించారు.

భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మార్చేందుకు వీలు లేకుండా పాత పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి చట్టం చేస్తామని ఆయ‌న తెలిపారు. మహాత్మా గాంధీ ఇంగ్లీష్ పాఠశాలల ద్వారా అందరికీ ఉచిత ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తామని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఆంగ్ల విద్యను కళాశాలలకు విస్తరింపజేస్తామని కూడా స‌భాముఖంగా తెలియ‌జేశారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన కుటుంబాలకు రూ. 15 లక్షల బీమాను అందిస్తుందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న హామీ ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫ్రెషర్‌లకు ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ అందజేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+