రాజస్థాన్ ఎన్నికలు: కాంగ్రెస్ నాలుగు, ఐదో జాబితా విడుదల, 61 మంది అభ్యర్థులు

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ (Congress) 56 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రకటించారు. కీలకమైన బికనేర్ తూర్పు నియోజకవర్గంలో యశ్ పాల్ గెహ్లాట్ ను కాంగ్రెస్ బరిలోకి దించింది.

ఖండేలా స్థానం నుంచి మహదేవ్ సింగ్, ఎస్సీ నియోజకవర్గమైన హంద్వాన్ నుంచి అనితా జాతవ్ ను పోటీకి దింపింది. కాన్పూర్ నుంచి సురేశ్ గుజ్జర్, ఉదయ్‌పూర్ నుంచి గౌరవ్ వల్లభ్, ఉదయ్‌పూర్ రూరల్ నుంచి వివేక్ కటారా బరిలో దిగుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలుత 33 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ.

Rajasthan Assembly polls: Congress Announces Fourth and 5th List Of 56, 5 Candidates

రెండో జాబితాలో 43 మంది, మూడో జాబితాలో మరో 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిసి ఇప్పటి వరు 151 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

అయితే, మంగళవారం రాత్రి మరో ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం అభ్యర్థులు 156కు చేరారు. కాంగ్రెస్ నేత రూపారాం మేఘ్వాల్.. జైసల్మేర్ నుంచి పోటీలో దిగుతున్నారు.

కాగా, రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెలువడించనున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికల దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+