వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ పెళ్ళిళ్ళలో డీజేలు, బరాత్ లు బంద్.. కరోనా కారణమనుకుంటే తప్పులో కాలేసినట్టే.. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

సహజంగా పెళ్లంటే వధూవరులను జంటగా మార్చే సాంప్రదాయంగా జరిగే వివాహ వేడుక మాత్రమే కాదు, బంధుమిత్రులు అందరూ సంతోషంగా జరుపుకునే ఓ పండుగ. డీజే డాన్స్ లతో, బరాత్ లతో జరుపుకునే ఒక వేడుక. కానీ రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఈ వేడుకలను నిర్వహించవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఫుల్లుగా మద్యం తాగి, డీజే డాన్స్ లు చేయడాన్ని, పెళ్లిళ్లలో నిర్వహించే బరాత్ వేడుకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పెళ్లిలో చిచ్చుపెట్టిన పూల‌దండ‌..వధూవరుల కుటుంబాల మధ్య ఘర్షణ; చివ‌ర‌కు ఏమైందంటేపెళ్లిలో చిచ్చుపెట్టిన పూల‌దండ‌..వధూవరుల కుటుంబాల మధ్య ఘర్షణ; చివ‌ర‌కు ఏమైందంటే

పెళ్లి వేడుకల్లో మద్యం తాగటం, డీజే డ్యాన్సులు బ్యాన్ చేసిన గ్రామం

పెళ్లి వేడుకల్లో మద్యం తాగటం, డీజే డ్యాన్సులు బ్యాన్ చేసిన గ్రామం

బన్స్వారాలోని ఛోటీ సర్వాన్‌లోని ఘోడి తేజ్‌పూర్ గ్రామంలోని గిరిజన సంఘం వివాహాల్లో మద్యం త్రాగడాన్ని, అలాగే డిజెలు పెట్టి డాన్సులు చేయడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఎంతో కాలంగా వస్తున్న పురాతన సంప్రదాయానికి తేజ్ పూర్ గ్రామం ముగింపు పలికింది. కరోనా మహమ్మారి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం దావత్ లు, బరాత్ ల వల్లే అక్కడ గొడవలు, విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా వివాహ వేడుకలలోనే గొడవలు జరిగి అనేక దారుణాలు జరుగుతున్నాయి.

వివాదాలు, విషాదాలు లేకుండా బ్యాన్ నిర్ణయం.. ఉల్లంఘిస్తే జరిమానాలు

వివాదాలు, విషాదాలు లేకుండా బ్యాన్ నిర్ణయం.. ఉల్లంఘిస్తే జరిమానాలు

అందుకే వివాదాలు, విషాదాలు, అనవసర ఖర్చులు లేకుండా ఉండేందుకు ఘోడి తేజ్‌పూర్ గ్రామంలోని ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయాలను ఉల్లంఘించిన వారికి మద్యం సేవించినట్లయితే రూ. 21,000 జరిమానా విధిస్తారు. అలాగే బిగ్గరగా సంగీతాన్ని ప్లేచేసి డీజేలు పెట్టి డాన్సులు చేస్తే రూ. 51,000 జరిమానా విధించబడుతుంది. వివాహ వేడుకలలో ఈరోజు ఉల్లంఘించిన వారికి ఈ జరిమానాలు విధించబడతాయని పేర్కొన్నారు.

 గ్రామస్తుల అంగీకారం .. రిజిస్టర్ లో సంతకాలు చేసిన గ్రామస్తులు

గ్రామస్తుల అంగీకారం .. రిజిస్టర్ లో సంతకాలు చేసిన గ్రామస్తులు

ఘోడి తేజ్ పూర్ గ్రామంలోని మాజీ, ప్రస్తుత సర్పంచ్‌ల సమక్షంలో నిషేధం, జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గ్రామం లోని 13 వ వార్డు మెంబర్లు, జిల్లా పరిషత్, పంచాయతీ సమితి సభ్యులు, గ్రామస్తులందరూ సర్వ సమాజ్ పేరుతో తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రిజిస్టర్లో సంతకాలు చేశారు . ప్రజలంతా ఈ నిర్ణయానికి సంబంధించిన నకలు కాపీని ధన్ పూర్ పోలీసులకు సైతం అందించారు. సోషల్ మీడియాలో ఈ గ్రామ నిర్ణయంపై ప్రస్తుతం హర్షం వ్యక్తమవుతోంది.

Recommended Video

Private Cryptocurrencies In India క్రిప్టో కరెన్సీ.. తెలుసుకోవాల్సిందే..!! || Oneindia Telugu
అనవసరపు ఖర్చు , గొడవలు తగ్గుతాయన్న పంచాయతీ పెద్దలు

అనవసరపు ఖర్చు , గొడవలు తగ్గుతాయన్న పంచాయతీ పెద్దలు


హరినాథ్ పురా పంచాయతీ సమితి ప్రెసిడెంట్ శ్యామ ఖడియా మాట్లాడుతూ డీజే మ్యూజిక్ వల్ల పెళ్లిళ్లు ఒక న్యూసెన్స్ లా తయారయ్యాయి అని పేర్కొన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు వివాహ వేడుకలలో సాంప్రదాయబద్ధమైన వాయిద్యాల సంగీతానికి తిరిగి రావడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. పెళ్లి వేడుకలను వృధా ఖర్చు నివారించటానికి మద్యం సేవించడంపై, డీజే డాన్స్ లపై విధించిన బ్యాన్ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ గ్రామస్తులు చైతన్యంతో తీసుకున్న నిర్ణయం నిజంగా ఆదర్శనీయం.

English summary
The tribal society at Ghodi Tezpur village in Choti Sarwan of Banswara in Rajasthan has decided to ban liquor and loud music at weddings, bringing an end to the age-old tradition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X