చిన్నారి పెళ్ళికూతురు: డాక్టర్ అయింది, భార్య స్పూర్తితో డిగ్రీ పూర్తిచేసిన భర్త

ఊహ తెలిసి తెలియని వయస్సు. తనకన్న నాలుగేళ్ళ వయస్సున్న వ్యక్తితో వివాహం. అదే వయస్సులో అత్తగారింట్లో అడుగుపెట్టింది.

జైపూర్: ఊహ తెలిసి తెలియని వయస్సు. తనకన్న నాలుగేళ్ళ వయస్సున్న వ్యక్తితో వివాహం. అదే వయస్సులో అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఎనిమిదేళ్ళ వయస్సుల్లో 12 ఏళ్ళ వయస్సున్న వ్యక్తిని వివాహం చేసుకొన్నా ఓ చిన్నారి పెళ్ళికూతురు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకొంది. ఎంబిబిఎస్ సీటును దక్కించుకొంది.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రూపాయాదవ్, శంకర్ లాల్ లకు చిన్నతనంలోనే వివాహమైంది. వివాహమైనాటినికి రూపాయాదవ్ వయస్సు 8 ఏళ్లు, శంకర్ లాల్ వయస్సు 12 ఏళ్ళు.వివాహం చేసుకొనే సమయానికి రూపాయాదవ్ మూడో తరగతి చదువుతోంది.

శంకర్ ఏడో తరగతి చదువుతున్నాడు. చదువంటే రూపకి ప్రాణం. అయితే పదోతరగతి వరకు పుట్టింట్లోనే ఉంది. పదోతరగతి పరీక్షలు రాసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళింది. పదోతరగతిలో 834 శాతం మార్కులతో పాసైంది.

అత్తగారింటికి వెళ్ళినా కానీ, ఆమె తాను చదువుకోవాలనే కోరికను వదులుకోలేకపోయింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే రూప కోరికను భర్త కాదనలేకపోయాడు.ఆమెను చదివించేందుకు ఒప్పుకొన్నాడు.

ఆరుకిలోమీటర్ల దూరంలోని స్కూల్ కు వెళ్ళింది

ఆరుకిలోమీటర్ల దూరంలోని స్కూల్ కు వెళ్ళింది

అత్తింటివారు కూడ రూపాయాదవ్ కు చదువుపై ఉన్న ప్రేమను కాదనలేకపోయారు. ఆమెను పదవతరగతి తర్వాతి చదువులను చదివేందుకు ఒప్పుకొన్నారు. రూపా అత్తింటివారి ఊళ్ళో పదవతరగతి తర్వాత స్కూల్ లో చేర్పించారు. అయితే ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. శంకర్ తన భార్య రూపాను ఆరు కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో చేర్పించారు. 12, తరగతిలో కూడ రూపాయాదవ్ మంచి మార్కులతో పాసైంది.

బిఎస్ సి లో చేరిన రూపా

బిఎస్ సి లో చేరిన రూపా

12వ, తరగతి పాస్ కావడంతో ఇక డిగ్రీ బిఎస్ సి లో చేరింది. వెంటనే వైద్యకళాశాలలో ప్రవేశానికి పరీక్ష రాసింది. కానీ, సీటు రాలేదు. దీంతో పోటీపరీక్షలకు శిక్షణనిచ్చే కేంద్రంలో చేరింది. భర్త, భావ ఆ శిక్షణ నిమిత్తం కట్టాల్సిన ఫీజు కోసం ఆటోలు నడిపారు. అయినా ఈ దఫా కూడ ఆమెకు వైద్య కళాశాలలో సీటు దక్కలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు.

చదువెందుకంటూ హేళన చేసినా

చదువెందుకంటూ హేళన చేసినా

గ్రామస్థులంతా చదువెందుకంటూ రూపాయాదవ్ ను హేళన చేశారు. ఆమెను చదువు మాన్పించాలంటూ సూచించారు. అయినా ఆ కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంలో రూపాకు అండగా నిలిచారు. ఇంట్లో పనులు మానివేసి చదువంటూ ఊళ్ళ వెంట తిరుగుతోందని మాట్లాడేవారు. అయితే రూప పట్టుదలను చూసిన భర్త ఆమెను ,ప్రోత్సహించాడు.

75 శాతం పీజును రద్దుచేసిన కోచింగ్ సెంటర్

75 శాతం పీజును రద్దుచేసిన కోచింగ్ సెంటర్

రూపా పరిస్థితిని చూసిన కోచింగ్ సెంటర్ యాజమాన్యం 75 శాతం ఫీజును రద్దుచేసింది. దీంతో ఆమె మరోసారి కోచింగ్ తీసుకొంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసింది. 720 మార్కులకు గాను ఆమెకు 603 మార్కులు వచ్చాయి. దీంతో ఆమె జాతీయస్థాయిలో 2 వేల 283 మార్కులు వచ్చాయి. రాజస్థాన్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వ కళాశాలలోనే ఆమెకు సీటు వస్తోంది. రూప ఎంబీబీఎస్ పూర్తయ్యేదాకా నెలకు కొంత ఉపకారవేతనాన్ని ఇస్తానంటూ కోచింగ్ సెంటర్ ప్రకటించింది.

భార్యను చూసి డిగ్రీ పూర్తిచేసిన శంకర్

భార్యను చూసి డిగ్రీ పూర్తిచేసిన శంకర్

రూపాను చూసిన శంకర్ డిగ్రీ పూర్తిచేశారు. భార్య సాధించిన విజయం వెనుక అడుగడుగున శంకర్ ప్రోత్సహం ఉంది. అంతేకాదు రూపను చూసిన శంకర్ తాను కూడ డిగ్రీని పూర్తిచేశారు. అయితే తాను ఎంబిబిఎస్ సీటు సాధించేందుకు తన భర్త , బావ ఆటోలు నడిపారని ఆమె ఉద్వేగానికి గురయ్యారు. అయితే తన జీవిత లక్ష్యాన్ని సాధించడంలో ఆమె సక్సెస్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+