ఘోర ప్రమాదం: నదిలో పడిన బస్సు, 32మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది దుర్మరణం చెందారు. మరో 9 మంది గాయపడ్డారు.

సవాయి మధోపూర్‌లోని దుబి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. సహాయ చర్యలు స్థానికులు కూడా పాల్గొన్నారు.
Rajasthan: #Visuals from the site of accident in Dubi, Sawai Madhopur ; 12 people dead, 24 injured after a bus carrying passengers fell of a bridge into a river pic.twitter.com/7pruEkOjmc
— ANI (@ANI) December 23, 2017
ఇప్పటివరకు 32 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రయాణికులంతా నిద్రలో ఉండటం, బస్సు పూర్తిగా నదిలో మునిగిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications