గడ్కరీతో భేటి అయిన వసుంధర రాజె
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెతో భేటి అయ్యారు. వీరిద్దరు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. ఇదే సమయంలో వసుంధర రాజే గడ్కరీకి తన కుమారుడికి సంబంధించిన వివరాలు వెల్లడించారని తెలిసింది.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ వీసా విషయంలో నియమాలు ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కుమారుడు, ఎంపీ దుష్యంత్ కంపెనీలలో లలిత్ మోదీ రూ. 11 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని వెలుగు చూసింది.

ఈ సందర్బంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మీద పలు ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు బీజేపీ మీద దుమ్మెత్తిపోశాయి. బీజేపీ నాయకులు సుష్మా స్వరాజ్, వసుంధర రాజెలకు అండగా నిలిచారు.
ప్రధాని మోదీ సలహా మేరకు వసుంధర రాజె బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ కావాలసి ఉంది. అయితే అది జరగలేదు. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు గడ్కరీతో వసుంధర రాజె భేటీ కావడం విశేషం.












Click it and Unblock the Notifications