High Court: వివాహేతర సంబంధం నేరం కాదు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు..
ఇద్దరు మేజర్లు పరస్పర ఆంగీకారంతో శృంగారం(వివాహేతర సంబంధం) చేస్తే నేరంగా పరిగణించలేమని రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇద్దరి అనుమతితోనే వారు శృంగారంలో పాల్గొంటారు కాబట్టి నేరం కాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. ఈ కేసు వేసిన వ్యక్తి వేరే కేసులో జైలు ఉండడంతో హాజరు కాలేదు.
కానీ అతని భార్య కోర్టుకు హాజరయ్యారు. తనను ఎవరు కిడ్నాప్ చేయాలేదని ఆమె కోర్టు తెలిపారు. నిందితుల్లో ఒకరితో తనకు సంబంధం ఉందని చెప్పారు. వివాహేతర సంబంధం ఉందని మహిళ ఒప్పుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇందుకు ఐపీసీ సెక్షన్ 494, 497(వ్యభిచారం) కింద నేరంగా భావించి శిక్షించాలని కోర్టును కోరారు. అయితే ఆమె చేసింది నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 497 ప్రకారం వ్యభిచారం నేరం మినహాయింపు జస్టిస్ బీరేంద్ర కుమార్ అన్నారు. వివాహేతర సంబంధం నేరం కాదని 2018 సుప్రీంకోర్టు పేర్కొంది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని సుప్రీం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని తేల్చిచెప్పింది.
వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని చెప్పిన సుప్రీం దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని తెలిపింది. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018లో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం 2023లో సవరించిన సంగతి తెలిసిందే. సాయుధ దళాల్లో వ్యభిచారానికి పాల్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications