Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సచిన్ సిక్స్ కొడితే సీఎంకు బాల్ కనపడలేదు,సీఎంకు చిన్నప్పటి ఏనుగమ్మ ఏనుగు పాట గుర్తుకొస్తోంది,దేవుడా!

జైపూర్/ న్యూఢిల్లీ/ లక్నో: కరోనా (COVID 19) కాలంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ కు ఎవ్వరికీ రాని కష్టాలు ఎదురౌతున్నాయి. ఓ పక్క ఇంతకాలం పక్కలో ఉండి నేడు బళ్లెం అయిన సచిన్ పైలెట్ సిక్స్ కొట్టడంతో ఆ బాల్ కనపడకపోవడంతో సీఎం తల గిర్రున తిరిగిపోయింది. ఇదే సమయంలో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు, బీఎస్ పీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కుర్చి కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న సీఎంకు ఏనుగు ఎక్కడ బలంగా కొడుతుందో అనే భయంతో ఆయనకు చిన్నప్పటి పాట ఏనుగమ్మ ఏనుగు గుర్తుకు వస్తోంది. బీఎస్ పీకి చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు నేడు సీఎంకు దేవుళ్లతో సమానం అయ్యారు. అయితే ఆగస్టు 11వ తేదీ హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో ? అంటూ సీఎం అశోక్ గెహ్లెట్ చాలా టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సచిన్ సిక్స్ కొట్టాడు

ఇప్పటికే సచిన్ సిక్స్ కొట్టాడు

కేపీసీసీ అధ్యక్షుడితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి సీఎం అశోక్ గెహ్లెట్ కు సవాలు విసిరారు. అదే సమయంలో సచిన్ పైలెట్ కు మరో 18 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వడంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ తల గిర్రున తిరిగిపోయింది. ఒక్కసారిగా సచిన్ సిక్స్ కొట్టడంతో సీఎం అశోక్ గెహ్లెట్ కు బాల్ కనపడకుండా పోయింది.

సీఎంకు 6 ఏనుగుల బలం

సీఎంకు 6 ఏనుగుల బలం

సచిన్ పైలెట్ తో పాటు ఆయన వర్గం సీఎం అశోక్ గెహ్లెట్ కు సినిమా చూపిస్తున్న సమయంలోనే బీఎస్ పీకి చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఇదే సమయంలో బీఎస్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామని రాజస్థాన్ కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అబ్బా ఆరు ఏనుగల బలం వచ్చిందని సీఎం అశోక్ గెహ్లెట్ కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.

 బీఎస్ పీ విలీనం వెనుక రామాయణం

బీఎస్ పీ విలీనం వెనుక రామాయణం

బీఎస్ పీకి చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని బీఎస్ పీ పార్టీ టాప్ లీడర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బీఎస్ పీ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ చీఫ్ మాయావతి ఇప్పటికే మండిపడిన విషయం తెలిసిందే. ఆరు మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ 2019 సెప్టెంబర్ నెలలోనే బీజేపీ, బీఎస్ పీ నాయకులు రాజస్థాన్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

 హైకోర్టులో వివాదం

హైకోర్టులో వివాదం

రాజస్థాన్ లోని ఆరు మంది బీఎస్ పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడానికి సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏకసభ్య బెంచ్ పిటిషన్ విచారణ చేస్తోంది. ఆగస్గు 11వ తేదీన రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే ఆరు మంది బీఎస్ పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచెయ్యడానికి హైకోర్టు అభ్యంతరం చెప్పలేదు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఎలా చెబుతుందో? అంటూ ఇప్పుడు సీఎం అశోక్ గెహ్లెట్ వర్గానికి టెన్షన్ మొదలైయ్యింది.

సీఎంకు మ్యాజిక్ ఫిగర్

సీఎంకు మ్యాజిక్ ఫిగర్


రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ ఈనెల 14వ తేదీన అసెంబ్లీలో బలప్రదర్శన నిరూపించుకోవడానికి సిద్దం అవుతున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ ఆయన సీటు కాపాడుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 ఎమ్మెల్యే మద్దతు అవసరం. అయితే ఆరు మంది బీఎస్ పీ ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వకపోతే సీఎంకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల బలం 96కు పడిపోతుంది. రాజస్థాన్ లో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సచిన్ పైలెట్ వర్గం ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు స్వతంత్రపార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఇస్తే ప్రతిపక్షాల బలం (బీజేపీ) 97కు చేరుకుంది.

Recommended Video

    క్లైమాక్స్‌కు చేరిన కర్నాటకం..!! || Karnataka CM Kumaraswamy To Face Floor Test Today || Oneindia
    తేడా వస్తే సీఎంకు సినిమా

    తేడా వస్తే సీఎంకు సినిమా


    హైకోర్టు తీర్పుతో అటుఇటు అయితే రాజస్థాన్ లో ఎవరైనా అధికారంలో ఉండాలంటే అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ నెంబర్ 97కు పడిపోతుంది. ఇప్పుడు ఏనుగు బలం ఉంటేనే సీఎం అశోక్ గెహ్లెట్ కుర్చీ మిగులుతుంది. కొంచెం అటూఇటూ అయినా సీఎంకు సినిమా కనపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+