రాజస్థాన్ రైతుది ఆత్మహత్య కాదా?: అతని రాత కాదంటున్న ఫ్యామిలీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీలో మరణించిన రాజస్థాన్ రైతుది ఆత్మహత్య కాదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం రాజస్థాన్‌కు చెందిన గజేంద్రసింగ్ కళ్యాణవత్‌ ఢిల్లీలో చెట్టెక్కి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సూసైడ్ నోట్‌లోని రాత గజేంద్ర సింగ్‌ది కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. దాంతో సంఘటన మరో మలుపు తిరిగింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజేంద్ర సింగ్ చెట్టుకు ఉరేసుకుని అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. సింగ్ అంత్యక్రియలు నంగల్ ఝామర్వాడాలోని ఆయన ఇంటి వద్ద గురువారనాడు జరిగాయి.

 Rajasthan farmer's family members say 'suicide note' was not in his handwriting

ఆయన 11 ఏళ్ల పెద్ద కుమారుడు చితికి నిప్పు అంటించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో పాటు కాంగ్రెసు నాయకులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. సూసైడ్ నోట్‌ను తాము టెలివిజన్ చానెళ్లలో చూశామని, అది అతని చేతిరాత కాదని రాజేంద్ర సింగ్ సోదరితో పాటు అతని ఆంటీ అంటున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ రాసింది.

రాజేంద్ర సింగ్ నిస్పృహలో కూడా లేడని వారంటున్నారు. వడగళ్ల వానకు పంట నష్టం జరిగి అతను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, అతని పంట నష్టం కూడా పెద్దగా లేదని చెబుతున్నారు. అయితే, ఆప్ ర్యాలీలో తాను చేయదలుచుకున్న ప్రసంగ పాఠమే సూసైడ్ నోట్ అనే వాదన కూడా వినిపిస్తోంది.

రాజకీయాల్లో తన సత్తా చాటాలని రాజేంద్ర సింగ్ అనుకున్నాడు. రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+