పొలిటికల్ హీట్ పెంచిన హైకోర్టు: కేంద్రాన్ని ప్రతివాదిగా: అప్పటిదాకా స్టేటస్ కో

జైపూర్: రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరి కొంతకాలం కొనసాగేలా ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో ఈ పొలిటికల్ హైడ్రామాకు తెర పడుతుందని ఆశించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది రాజస్థాన్ హైకోర్టు. ఈ కేసులో చిట్టచివరి నిమిషంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, అనర్హత వేటును ఎదుర్కొంటోన్న సచిన్ పైలెట్ దాఖలు చేసిన పిటీషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. దీనితో ఈ కేసు విచారణలో మరో ట్విస్ట్ ఏర్పడింది.

చివరి నిమిషంలో సచిన్ పైలెట్ తాాజా పిటీషన్..

చివరి నిమిషంలో సచిన్ పైలెట్ తాాజా పిటీషన్..

తనతో పాటు తన వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సచిన్ పైలెట్.. హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సచిన్ పైలెట్ సహా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ హైకోర్టు స్టే విధించింది. శుక్రవారం వరకూ గడువు ఇచ్చింది. గడువు ముగియడంతో ఈ కేసుపై హైకోర్టు తుది తీర్పు వెలువడుతుందని ఆశించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

కేంద్రాన్ని ప్రతివాదిగా..

కేంద్రాన్ని ప్రతివాదిగా..

వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా కనిపించింది. చివరి నిమిషంలో సచిన్ పైలెట్ దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలంటూ సచిన్ పైలెట్ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ విషయాన్ని స్పీకర్ సీపీ జోషి తరఫు న్యాయవాదిగా వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ప్రతీక్ కస్లీవాల్ తెలిపారు.

 స్టేటస్ కో కొనసాగింపు..

స్టేటస్ కో కొనసాగింపు..

కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చడం వల్ల తీర్పు వెలువడటంలో జాప్యం చోటు చేసుకోవచ్చని ఆయన అన్నారు. కేంద్రం వాదనలను కూడా హైకోర్టు వినాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో స్టేటస్ కో ను కొనసాగించాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ దాఖలు చేసిన ఈ కేసు విచారణలో యధాతథ స్థితిని కొనసాగించలని సూచించింది. తుది తీర్పు వెలువడేంత వరకూ స్టేటస్ కో కొనసాగుతుందని హైకోర్టు న్యాయమూర్తులు ఆదేశించారు.

Recommended Video

    Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?
    సచిన్ వర్గానికి ఊరట..

    సచిన్ వర్గానికి ఊరట..

    సోమవారం వరకూ స్టేటస్ కో కొనసాగుతుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ స్పీకర్ సీపీ జోషి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారానికి సుప్రీంకోర్టు తన తదుపరి విచారణను వాయిదా వేసింది. దీనితో స్టేటస్ కో ను అదే రోజుకు వాయిదా వేసింది రాజస్థాన్ హైకోర్టు. న్యాయస్థానాల్లో తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ సచిన్ పైలెట్, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ఊరట కలిగించేవేనని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+