అద్దెకు మెట్రో రైలు కోచ్‌లు... బర్త్ డేలు,ఈవెంట్లకు... ఒక్క గంటకు ఎంత చెల్లించాలంటే...
ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో జైపూర్ మెట్రో రైల్ సర్వీస్ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. రైల్వే కోచ్‌లను బర్త్ డే పార్టీలకు,ఇతరత్రా కార్యక్రమాలకు అద్దెకు ఇస్తామని ప్రకటించింది. నాలుగు గంటల కార్యక్రమానికి రూ.5000 చొప్పున వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
మెట్రో రైలు కార్పొరేషన్లో 292 ఉద్యోగాలు: అర్హతలు ఇవే... !
అవసరాన్ని బట్టి కస్టమర్స్ ఎన్ని కోచ్‌లనైనా అద్దెకు తీసుకోవచ్చు. నాలుగు కోచ్‌లను నాలుగు గంటల పాటు అద్దెకు తీసుకుంటే రూ.20వేలు వసూలు చేస్తారు. ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.5వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, మెట్రో స్టేషన్లలో బ్యానర్ల ద్వారా అడ్వర్టైజ్‌మెంట్స్,స్టాండ్స్ ఏర్పాటుకు సైతం అవకాశం కల్పించింది.

జైపూర్ మెట్రో గతంలోనూ ఇలాంటి సరికొత్త విధానాలను అవలంభించింది. షూటింగ్,షార్ట్ అడ్వర్టైజ్‌మెంట్స్‌కు మెట్రో కోచ్‌లను అద్దెకు ఇచ్చింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మెట్రో ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో తాజాగా మరికొన్ని సరికొత్త కార్యక్రమాలను లాంచ్ చేస్తోంది.
గతేడాది కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్నెళ్ల పాటు మూతపడ్డ జైపూర్ మెట్రో సేవలు... తిరిగి సెప్టెంబర్‌లో పునురద్దించబడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ముంబై లాంటి నగరాల్లో లోకల్ రైళ్లు కూడా నడుస్తుండగా హైదరాబాద్‌లో ఇప్పటికీ లోకల్ రైళ్ల సేవలను పునరుద్దరించలేదు.