Rajasthan Polls: ఏడు గ్యారంటీలతో రాజస్తాన్ ఎన్నికలకు కాంగ్రెస్-అశోక్ గెహ్లాట్ ప్రకటన..
రాజస్తాన్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ప్రకటించింది. ఇప్పటికే కర్నాటకలో ఆరు గ్యారంటీలు ఇచ్చి ఓటర్లను ఆకట్టుకుని గెలిచిన కాంగ్రెస్.. రాజస్తాన్ లో ఏడు గ్యారంటీలతో అధికారం నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగా ఏడు గ్యారంటీలను మ్యానిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్తున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు ఈ నెల 25న జరిగే ఎన్నికల్లో ఈ 7 గ్యారంటీలు కచ్చితంగా తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. జైపూర్ లో తాజాగా నిర్వహించిన కాంగ్రెస్ గ్యారంటీ యాత్రలో పాల్గొన్న సీఎం అశోక్ గెహ్లాట్.. మరోసారి అధికారమిస్తే తమ గ్యారంటీలను కచ్చితంగా నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఈసారి విపక్ష బీజేపీ వద్ద ఎన్నికల అజెండాయే లేదని, ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోందని గెహ్లాట్ తెలిపారు.

తాజాగా రాష్ట్రంలోని నౌగౌర్ లో మూడు బహిరంగసభలు నిర్వహించిన కేంద్రమంత్రి అమిత్ షాపై సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమిత్ షాకు రాష్ట్రంలో సమస్యలే తెలియవన్నారు. తాము మాత్రం ఈసారి ఎన్నికలకు ఏడు గ్యారంటీలతోనే వెళ్తున్నామని, కాంగ్రెస్ గెలిస్తే వీటి అమలుకు గ్యారంటీ క్యాంపులు కూడా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 2 కోట్ల మందికి చేరువయ్యేందుకు కాంగ్రెస్ వెయ్యి గ్యారంటీ క్యాంపులు నిర్వహిస్తుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుటుంబ పెద్దలకు రూ. 10,000 వార్షిక గౌరవ వేతనం, రూ. 500 నుండి 1.05 కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్లు, పశువుల పెంపకందారుల నుండి రూ. 2 పెంపకంతో పేడ కొనుగోలు వంటి ఏడు హామీలను గెహ్లాట్ తాజాగా ప్రకటించారు. ఇవి కచ్చితంగా తమను ఎన్నికల్లో గెలిపిస్తాయని ఆయన ఆశాభావంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications