చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: జయను టార్గెట్ చేసిన రజనీ 'కబాలి' టీజర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' టీజర్ రాజకీయ దూమారానికి కారణమైంది. యూట్యూబ్‌లో ఈ టీజర్ సంచలనాన్ని నమోదు చేసింది. విడుదలైన కొన్ని రోజులకే ఈ టీజర్‌నుకోటి మందికిపైగా వీక్షించారు.

మే 16న తమిళనాడులో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో 'కబాలి' టీజర్ పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 'నేను రా కబాలి' అంటూ రజనీ విశ్వరూపం చూపిన ఈ సినిమా టీజర్‌కు స్పూఫ్‌గా వెలువడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రజనీ 'కబాలి' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను మార్చి అన్నాడీఎంకేను, ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను టార్గెట్‌ చేస్తూ రూపొందించిన వీడియో ఇంటర్నెట్‌లో దుమారాన్ని రేపుతోంది. ఈ వీడియోలో రజనీ వాయిస్‌ను మార్చి నేరుగా జయలలితను టార్గెట్ చేశారు.

Rajini's Kabali Teaser Used to Mock AIADMK in Poll-Bound TN

ఇటీవలే చెన్నైలో సంభవించిన వరద విపత్తును ఎదుర్కోవడంలో జయలలిత ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ సాగే ఈ టీజర్‌ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ టీజర్‌లో విలన్ అన్నాడీఎంకేగా, రజనీని డీఎంకే మద్దతుదారుడిగా చూపిస్తూ విలన్‌ 'డీఎంకే ఎవరు' అని అడిగినట్టు ఉంది.

ఆపై అధికార అన్నాడీఎంకేపై తీవ్ర విమర్శలు చేస్తూ డీఎంకే (రజనీ) ఎంటరైనట్టు ఈ టీజర్‌ను మార్చారు. రజనీ వాయిస్‌ని మార్చి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే ఈ టీజర్ వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియో తమిళనాడు ఎన్నికల్లో పెను ప్రభావాన్ని చూపనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు ఈ టీజర్‌‌పై అధికార అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ప్రతిపక్ష డీఎంకే మాత్రం తమకు ఈ వీడియోతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఈ టీజర్‌‌కు రాజకీయ రంగు పులుముకోవడంతో 'వాకెడ్ఔట్‌మీడియా' దీనిని ఇంటర్నెట్‌ నుంచి దీనిని తొలగించింది.

English summary
The teaser for Rajinikanth's next film Kabali has raked up more than a million hits on YouTube within two days of its release, but in poll-bound Tamil Nadu it also got mired in a political controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X