శ్రీలంకకు రజనీకాంత్: నిర్వాసితులకు ఇళ్లు!, బహిరంగ సభలో ప్రసంగం..

Subscribe to Oneindia Telugu

చెన్నై: శ్రీలంకలోని తమిళ నిర్వాసితుల పురోగతి కోసం పనిచేస్తున్న జ్ఞానం ఫౌండేషన్ సంస్థ తాజాగా వారి కోసం 150ఇళ్లను నిర్మించింది. విశేషమేంటంటే ఈ ఇళ్లను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల మీదుగా అందజేయనున్నారు.

లైకా గ్రూప్ చైర్మన్ కరన్ అల్లిరాజా పేరిట ఏర్పాటు జ్ఞానం ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు రూ.22కోట్లతో ఈ ఇళ్లను ఆ సంస్థ నిర్మించింది.2009లో శ్రీలంక అంతర్యుద్దం తర్వాత పలు ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల పున:నిర్మాణం కోసం జ్ఞానం ఫౌండేషన్ సంస్థ కృషి చేస్తూ వస్తోంది.

rajinikant to present keys of 150homes built for displaced tamils in srilanka

ఇదే క్రమంలో జప్నాలోని తమిళ నిర్వాసితుల కోసం 150 కొత్త ఇళ్లను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఈ ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 9న నిర్వాసితులకు అందజేయనున్నారు. నిర్వాసితులకు కొత్త ఇంటి తాళాలను అందజేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలోను ఆయన పాల్గొనున్నట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Superstar Rajinikanth will hand over keys to 150 homes built for Tamils by Gnanam Foundation on April 9 in Jaffna, Srilanka, according to a statement released by Lyca Productions
Please Wait while comments are loading...