వచ్చేస్తా, 31న ప్రకటిస్తా: పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తన రాజకీయ ప్రవేశంపై ఈ నెల 31వ తేదీన ప్రకటన చేస్తానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. ఆయన మంగళవారంనాడు కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తన అభిమానులను కలుసుకున్నారు.

తన అభిమానులను మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. తాను హీరో కావాలని సినిమాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. హీరోగా తన తొలి సంపాదన 50 వేల రూపాయలని ఆయన చెప్పారు.

Rajinikanth to announce his political entry on December 31

తాను రాజకీయాల్లోకి రావడమంటే విజయం సాధించినట్లేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రజనీకాంత్ ఆరు రోజుల పాటు తన అభిమానులతో సమావేశమవుతారు. మంగళవారంనాడు కాంచీపురం, తిరువళ్లూరు, తదితర ప్రాంతాలకు చెందిన అభిమానులను కలుసుకున్నారు.

రాజకీయాలు తనకు కొత్త కాదని, ఇప్పటికే రాజకీయాల్లోకి రావడం ఆలస్యం చేశానని ఆయన అన్నారు. తాను 1996 నుంచి రాజకీయాలను చూస్తున్నానని ఆయన చెప్పారు. యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలని ఆయన అన్నారు.

  Posters Hulchul in TamilNadu Name as Rajinikanth CM - Oneindia Telugu

  మీడియానే ఎక్కువ ఆసక్తి చూపుతోందని, సూపర్ స్టార్ కావాలని సినిమాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. 

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tamil Super star Rajinikanth said that he will make an announcement on his political entry on December 31.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి