Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయ మరణంతో రాజకీయ శూన్యత,ఎంజీఆర్ తరహ పాలన ఇస్తా: రజనీకాంత్

చెన్నై: ఎంజీఆర్ తరహ పాలనను అందించనున్నట్టు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. దీన్ని భర్తీ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు ఆయన ప్రకటించారు.

రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తర్వాత రజనీకాంత్ ఎంజీఆర్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో సోమవారం నాడు తొలిసారిగా మాట్లాడారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని సోమవారం నాడు చెన్నైలోని ఎంజిఆర్ రామచంద్రన్ ఎడ్యుకేషనల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సోమవారం నాడు ఆవిష్కరించారు.

సుమారు ఐదువేల మంది విద్యార్థులు ఈ సమావేశానికి హజరయ్యారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదిన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లకు పోటీ చేయనున్నట్టుగా రజనీకాంత్ ప్రకటించారు. . ఇప్పటికే తమిళనాడుకు చెందిన మరో హీరో కమల్‌హసన్ కూడ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.

సినిమాల ద్వారానే రాజకీయాల్లోకి

సినిమాల ద్వారానే రాజకీయాల్లోకి


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితలు సినిమాల ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారని తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తు చేశారు. తనకు కూడ సినిమాల ద్వారానే ఇంత పెద్ద గుర్తింపు దక్కిందని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.

జయ మరణంతో రాజకీయ శూన్యత

జయ మరణంతో రాజకీయ శూన్యత

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు రజనీకాంత్ ప్రకటించారు. అయితే రాజకీయాల్లో కొనసాగడం అంత ఈజీ కాదని తనకు తెలుసునని రజనీకాంత్ ప్రకటించారు.

ఎంజీఆర్‌లా సేవ చేయాలని ఉంది

ఎంజీఆర్‌లా సేవ చేయాలని ఉంది

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మాదిరిగా ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ . ఎంజీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడ అదే తరహ పాలనను అందించాలని భావిస్తున్నానని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.

 ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయడం లేదు

ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయడం లేదు

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పనులు చేయడం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+