అంతా భగవంతుడి చేతిలో, ఏ నిర్ణయమైన నిరాశ పడొద్దు: రాజకీయాలపై రజనీకాంత్
Recommended Video

Rajinikanth political entry : రాజకీయాల్లోకి నో 'కామెంట్' అంటున్న రజనీకాంత్
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఆదివారం (31-12-2017) ప్రకటన చేయనున్నారు. శనివారం ఐదో రోజు అభిమానులతో సమావేశం సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాలని, ఒకవేళ అవి నెరవేరకుంటే కలత చెందవద్దన్నారు.
చదవండి: పవన్ కళ్యాణ్ మాట, రజనీ మనసులో మాట!: కానీ, చిరంజీవిని లాగి పొరపాటు చేశారా?
కలలు నెరవేర్చుకునేందుకు అడ్డదారులు తొక్కవద్దని సూచించారు. అనేక మలుపులు, దశలు దాటిన తన సినీ జీవితం ప్రస్తుతం కాలా, 2.0 చిత్రాలకు చేరుకుందన్నారు. ఈ చిత్రాల తర్వాత తన జీవితం దేవుడి చేతిలో ఉంటుందన్నారు.

ఈ సినిమాలు పూర్తయిన తర్వాత నటిస్తానో లేదో అంతా భగవంతుడి చేతిలోనే అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే విషయమై అభిమానులు అందరూ ఓపిక పట్టాలని, ఆశించిన నిర్ణయం రాకపోయినా నిరాశ చెందవద్దన్నారు.












Click it and Unblock the Notifications