తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది
అసెంబ్లీ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంటోన్న వేళ.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం దీనికి కేంద్ర బిందువు కావడం చర్చనీయాంశమైంది. అధికార డీఎంకేను విమర్శించబోయి అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ను లాగడం దుమారానికి దారి తీసింది. దీనికి టీవీకే వివరణ ఇచ్చుకునే పరిస్థితి తలెత్తింది. ఈ వివాదంపై తాజాగా రజినీకాంత్ కూడా స్పందించారు.
ఇటీవలే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు డీఎంకే బెదిరించిందని ఆయన ఆరోపించారు. తమిళ రాజకీయాల్లో ఎంజీ రామచంద్రన్ శకం ముగిసిన తర్వాత ఆయన ఖాళీ చేసిన స్థానాన్ని రజినీకాంత్ భర్తీ చేయాలని భావించారని, రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఆశించారని పేర్కొన్నారు. డీఎంకే నాయకత్వ కుటుంబ సభ్యులే బెదిరించి, ఒత్తిడి చేయడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశాన్ని విరమించుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు.

ప్రస్తుతం డీఎంకే కుటుంబానికి చెందిన రెడ్ జెయింట్ మూవీస్ లల్లో నటిస్తున్న రజినీని విమర్శించడం తన లక్ష్యం కాదని, విజయ్ రాజకీయ ధైర్యాన్ని చాటడమే తన ఉద్దేశ్యమని అన్నారు. విజయ్ మాత్రం ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా, ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, సొంతంగా ఓ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతున్నారని అధవ్ అర్జున చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై తక్షణమే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రజనీకాంత్ మాజీ సలహాదారు ఆర్ అర్జునమూర్తి దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు కారణమవుతాయని పేర్కొన్నారు. విజయ్ తక్షణమే అర్జునపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఎస్ రఘుపతి కూడా ఆధవ్ అర్జున ఆరోపణలను కొట్టిపారేశారుె. టీవీకే తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రజనీకాంత్ డీఎంకేతో స్నేహపూర్వకంగా ఉండేవారని, 1996 ఎన్నికలలో పార్టీకి మద్దతు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సైతం అర్జున ఆరోపణలను తిప్పికొట్టారు.
ఈ పరిణామాలపై తాజాగా రజినీకాంత్ స్పందించారు. అధవ్ అర్జున చేసిన అవాస్తవ వ్యాఖ్యలను ఖండించి, మద్దతుగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పళనిస్వామి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, మంత్రి రఘుపతి వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు.
— Rajinikanth (@rajinikanth) March 17, 2026
వారితో పాటు తిరుమావళవన్, ఎస్పీ వేలుమణి, మిత్రుడు అన్నాదురై, అర్జునమూర్తి, అన్బుమణి రామ్ దాస్, జీకే వాసన్, జాన్ పాండియన్, పుహళేందితో పాటు పలు పార్టీల ఇతర రాజకీయ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినీ ప్రముఖులు అమీర్, జీ ధనుంజయ్, ఇతర సినీ రంగాలకు చెందిన నక్కిరన్ గోపాల్, చాణక్య రంగరాజ్ పాండే వంటి మీడియా ప్రతినిధులు స్పందించారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోన్నానని రజినీకాంత్ అన్నారు. "కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది" అని రజనీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications