‘ఆయన రాజకీయాల్లోకి వస్తే..’, లతా రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుందని, అందుకు అవసరమైన పలు పథకాలను ఆయన సిద్ధం చేసుకుంటున్నారని ఆయన భార్య లతా రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన భార్య లతా రజనీకాంత్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుందని, అందుకు అవసరమైన పలు పథకాలను ఆయన సిద్ధం చేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

లతా రజనీకాంత్ శ్రీ దయా ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నారు. మంగళవారం చెన్నై మైలాపూర్ లోని రష్యన్ కల్చరల్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ సంస్థ చేపట్టనున్న సేవా కార్యక్రమాలను ఆమె వివరించారు.

latha-rajinikanth

ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియా ప్రశ్నించగా.. రజనీకాంత్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆమె చెప్పారు. తలైవా రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మార్పు తథ్యమని కూడా లతా అన్నారు. తన భర్త ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు. త్వరలోనే రజనీకాంత్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆమె పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+