హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడి చేయం: నక్సల్స్‌పై రాజ్, 14కొత్త జిల్లాలు: నాయిని

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/మహబూబ్ నగర్: నక్సల్స్ పైన తాము ముందుగా దాడి చేయమని, వాళ్లు దాడి చేస్తే మాత్రం అణిచివేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం చెప్పారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సిఎస్‌లు, డీజీపీలతో రాజ్ నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదని చెప్పారు. తాము సమతూకం పాటిస్తామని చెప్పారు. నక్సల్స్ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. మావోయిస్టులతో చర్చలు జరపమన్నారు. అయితే సమస్య పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామన్నారు. ఆయన

Rajnath meets bureaucrats of Naxal-affected states

నిషేధం ఎత్తివేయాలి

మావోయిస్టుల పైన ప్రభుత్వ నిషేధాన్ని ఎత్తి వేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ విశాఖపట్నంలో డిమాండ్ చేశారు. వామపక్ష తీవ్రవాదం అనేది సైద్ధాంతిక పరమైనదేనని, దీనిని సామాజిక కోణంలో చూడాలని ఆయన అన్నారు. నక్సలైట్ల సమస్యను శాంతిభద్రతల అంశంగా పరిగణించినంత కాలం ఇది పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.

త్వరలో 14 జిల్లాలు: నాయిని

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 14 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందిస్తామని చెప్పారు. పోలీసులకు కొత్త డ్రెస్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. ఇకపై హైదరాబాద్ అంటే ప్రతి విషయంలో విభిన్నంగా ఉంటుందన్నారు.

English summary

 Home Minister Rajanth Singh on Friday met top bureaucrats of all Naxal-affected states. Sources say the Home Ministry is likely to assure states of all support from the Centre to fight the Naxal challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X